For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Aamir Khan నిజ స్వరూపం : ముందు మాటిచ్చాడు, ఫోన్ కూడా ఎత్తలేదు..శ్యాం సోదరుడు సంచలనం!

  |

  'వాంటెడ్', 'మున్నా మైఖేల్', 'రక్తచరిత్ర' మరియు 'స్లమ్‌డాగ్ మిలియనీర్' వంటి డజన్ల కొద్దీ హిట్ సినిమాల్లో నటించిన నటుడు అనుపమ్ శ్యామ్ ఓజా ఆగస్టు 8 న తన 63 వ ఏట కన్నుమూశారు. ఈ నటుడు మరణించదానికి 6 రోజుల క్రితం గోరెగావ్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఐసియులో చేరాడు. చేరినప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగా ఉంది, అక్కడ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. నివేదికల ప్రకారం, నటుడి మరణానికి కారణం మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్. అయితే ఆయన మరణం తరువాత వెలుగులోకి వచ్చిన ఆయన సోదరుడు అమీర్ ఖాన్ గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  63 సంవత్సరాల వయస్సులో

  63 సంవత్సరాల వయస్సులో

  63 సంవత్సరాల వయస్సులో ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిన అనుపమ్, అతని పేరుతో పిలిస్తే గుర్తు పట్టడం కష్టమే. ఎందుకంటే ప్రతిజ్ఞ అనే షోలో ఆయన చేసిన ఠాకూర్ సజ్జన్ సింగ్ పాత్రతోనే ఎక్కువ పాపులర్ అయ్యాడు. కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న అనుపమ్ ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నారు అని తెలుస్తోంది.

  ఈ మేరకు అనుపమ్ సోదరుడు అనురాగ్ శ్యామ్ కూడా ఈ విషయంలో సహాయం చేయమని బాలీవుడ్ పెద్దల్ని సహాయం కోసం వేడుకున్నాడు. అటువంటి పరిస్థితిలో, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇక ఆజ్ తక్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనురాగ్ తన సోదరుడు లేడనే వార్త ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని చెప్పారు. కొంతకాలం క్రితం నేను అతనిని చివరి సారిగా చూసి ఇంటికి వచ్చానని వెల్లడించారు.

  వెంటిలేటర్ మీద

  వెంటిలేటర్ మీద

  అప్పుడు పరిస్థితి చాలా విషమంగా ఉందని అనురాగ్ చెప్పారు. మేము ఆయనని ఐదు రోజుల క్రితం ఆసుపత్రికి తీసుకెళ్లామని వెల్లడించారు. ఇక సోదరుడు ప్రకారం, షూట్ సమయంలో అధిక మద్యపానం కారణంగా అతని ఆరోగ్యం క్షీణించింది మరియు అతను ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది, అక్కడ అతను మరణించాడు. ఊపిరితిత్తులు నీటితో నిండిపోయాయని అన్నారు. ఈ కారణంగా అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది.

  మొదట అతనికి ఆక్సిజన్ పెట్టారు, తర్వాత చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడంతో డాక్టర్ అతడిని వెంటిలేటర్ మీద పెట్టాడు. అప్పుడు వారు బాగానే ఉన్నారు. ఇక కొంచెం ఆరోగ్యం సెట్ కావడంతో వెంటిలేటర్లను తొలగిస్తున్నట్లు డాక్టర్ స్వయంగా చెప్పారని, కానీ అతని రక్తపోటు తగ్గిందని దీంతో అవయవాలు పని చేయడం ఆగిపోయాయి అని ఆ తర్వాత మరణించారని వెల్లడించారు.

  మరో షాక్‌

  మరో షాక్‌

  అన్న తన షో మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ 2 పూర్తి కాబోతోందనే విషయం ఎవరి ద్వారానో తెలుసుకున్నాడని, అలా మరో షాక్‌కు గురయ్యాడని అనురాగ్ అన్నారు. అన్న చాలా ఆలోచించేవాడని,. పని పట్ల మక్కువ కావడంతో ఇప్పుడు ఏమి జరుగుతుందో ?అని ఆలోచించేవాడని అన్నారు. బహుశా ఆందోళన మాత్రమే ఆయన మరణానికి కారణం అయి ఉంటుందని వెల్లడించారు.

  చివరిసారి మేము చికిత్స పొందలేకపోయామని అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేశామని అన్నారు. అలా చేయడం వలన దీని ప్రయోజనాన్ని కూడా పొందామని, యోగి ఆదిత్యనాథ్ నుండి సామాన్యుల వరకు కూడా డబ్బు పంపారని అన్నారు. నన్ను నమ్మండి, మాకు ఐదు రూపాయల సహాయం కూడా వచ్చిందని అన్నారు. ఆ సమయంలో నేను ఫోన్ తీసుకొని విరాళాలను వారికి చూపించినప్పుడు, ప్రజల ప్రేమను చూసి అన్న కళ్ళు నిండిపోయాయని నిరంతరం ఏడుస్తూనే ఉన్నారని వెల్లడించారు.

  తల్లి చనిపోయినా

  తల్లి చనిపోయినా

  ఇక గత నెలలో మా తల్లి చనిపోయిందని దానికి మా అన్న వెళ్లలేకపోయాడని, ఆ విషయంలో కూడా అయన కుంగిపోయాడని ఆయన అన్నారు, ప్రతాప్‌గఢ్‌లో డయాలసిస్ సెంటర్ లేదని, ఒకవేళ తాను వెళ్లి ఉంటే తన ప్రాణాలకు ప్రమాదం ఉందని అనురాగ్ అన్నారు. ప్రతాప్‌గఢ్‌లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎన్నో అభ్యర్ధనలు చేశారని అన్నారు. అన్న దీని కోసం అమీర్ ఖాన్‌ను కలిశాడు మరియు అతను కూడా దానికి అంగీకరించాడు కానీ అతను కొన్ని నెలల పాటు ఫోన్ తీయడం మానేశాడని ఆరోపించారు.

  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే

  ఇక అనుపమ్ శ్యామ్ గత సంవత్సరం కిడ్నీ చికిత్స పొందుతూ ఆర్థిక సంక్షోభానికి గురైనప్పుడు వెలుగులోకి వచ్చాడు. సహాయం కోసం నటుడు పరిశ్రమకు విజ్ఞప్తి చేశాడు, ఆ తర్వాత అతనికి చాలా మంది ప్రముఖుల మద్దతు లభించింది. అనుపమ్ టెలివిజన్ షోల ద్వారా తన నట జీవితాన్ని ప్రారంభించాడు, ఆ తర్వాత అతనికి అనేక బాలీవుడ్ చిత్రాలలో నటించే అవకాశం లభించింది.

  ఈ నటుడు 2009 లో మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞలో సజ్జన్ సింగ్ పాత్రలో కనిపించాడు, ఇది అతనికి మంచి పేరును సంపాదించింది. అనుపమ్ శ్యామ్, ఉత్తర ప్రదేశ్, ప్రతాప్‌గఢ్ నివాసి, 1993 లో నటనా జీవితం మొదలు పెట్టారు. లక్నోలోని భరతేందు అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ పూర్వ విద్యార్థి. అతను 'దస్తక్', 'దిల్ సే', 'లగాన్', 'గోల్‌మాల్' మరియు 'మున్నా మైఖేల్' వంటి బాలీవుడ్ సినిమాల్లో 'మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ'తో పాటు,' రిష్టే ',' డోలీ అర్మాన్ కి ',' కృష్ణ చాలీ లండన్ 'మరియు' హమ్ నే లే లి ఓత్ 'వంటి టీవీ సీరియల్స్‌లో కూడా పనిచేశారు.

  English summary
  Anupam Shyam's brother has made sensational allegations about his brother Aamir Khan after his death.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X