For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాప్ డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం: కూతురు, తల్లిదండ్రులకు బెదిరింపులే కారణమట!

  |

  బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ట్విట్టర్లో యాక్టివ్‌గా సినిమాలకు సంబంధించిన విషాయలతో పాటు సామాజిక అంశాలపై తనదైన అభిప్రాయాలు వెల్లడిస్తూ ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. కొన్ని రోజులుగా ఆయన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై సైతం విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ కారణంగా ఆయన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ట్రోల్స్ చేసే వారితో ఫైట్ చేస్తూ వస్తున్న ఆయన ఇపుడు ట్విట్టర్ నుంచి వైదొలగారు. తన కూతురును, తల్లిదండ్రులకు కీడు చేస్తామని బెదిరింపులు రావడం వల్లే చేసేది లేక తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

  అందుకే ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నాను

  అందుకే ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నాను

  ఈ మేరకు అనురాగ్ కశ్యప్ శనివారం సాయంత్రం చివరి ట్వీట్ చేశారు. ‘మీ తల్లిదండ్రులకు కాల్స్ వచ్చినపుడు, కూతురు ఆన్ లైన్ ద్వారా బెదిరింపులు వచ్చినపుడు మనం ఏమీ మాట్లాడలేం. వాటికి ఎలాంటి కారణం ఉండదు, హేతుబద్దత ఉండదు. దుండగులే పాలిస్తారు, ఇప్పుడంతా వాళ్ల రాజ్యమే నడుస్తుంది. ఈ విధమైన కొత్త ఇండియా వచ్చినందుకు అందరికీ కంగ్రాట్స్, మీరు మరింత వృద్ధి చెందుతారని నమ్ముతున్నాను' అని ట్వీట్ చేశారు.

  మనసులోని మాట మాట్లాడే పరిస్థితి లేదు

  మనసులోని మాట మాట్లాడే పరిస్థితి లేదు

  ‘‘నేను నా మనసులో ఉన్నది ఎలాంటి భయం లేకుండా మాట్లాడే అవకాశం, పరిస్థితులు లేనపుడు, నేను అసలు మాట్లాడను'... అని అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా ఇండియాలో భావ ప్రకటన స్వేచ్ఛ హరించిపోయిందంటూ పరోక్షంగా విమర్శించారు.

  ఇలాంటి ఇండియా వచ్చినందుకు కంగ్రాట్స్

  ఇలాంటి ఇండియా వచ్చినందుకు కంగ్రాట్స్

  తన ట్విట్టర్ ఖాతా క్లోజ్ చేయడంపై ఆయన ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ... ‘మీకు ఆన్ లైన్ ద్వారా బెదిరింపులు వస్తున్నపుడు, అవి మీ ఫ్యామిలీ వరకు వచ్చినపుడు ... అన్నీ మూసుకుని కూర్చోడమే మంచిది. ఇలాంటి న్యూ ఇండియా వచ్చినందుకు ఈదేశ ప్రజలకు నా శుభాకాంక్షలు. ఇక నేను దేని గురించి మాట్లాడను, నా పని నేను చూసుకుంటాను' అన్నారు.

  ఆర్టికల్ 370పై అనురాగ్ విమర్శలు

  ఆర్టికల్ 370పై అనురాగ్ విమర్శలు

  జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి, ఆర్టికల్ 370‌ను తొలగించే ప్రభుత్వ తాజా చర్యను అనురాగ్ విమర్శించారు. తన ట్వీట్లలో, అతను ఇలా వ్రాశాడు, "భయానకమైనది మీకు తెలుసా, 1,200,000,000 మంది ప్రజల ప్రయోజనం కోసం ఏమి చేయాలో సరైనది తనకు తెలుసునని, దానిని అమలు చేసే శక్తికి ప్రాప్యత తనకు ఉందని ఒక వ్యక్తి భావిస్తాడో అది భయానకమైనది." ఈ ట్వీట్ చేసిన అనురాగ్ కశ్యప్ మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

  English summary
  Anurag Kashyap quits Twitter. In what can be considered his last tweet, Anurag wrote, “When your parents start to get calls and your daughter gets online threats then you know no one wants to talk. There is going to be no reason or rationale. Thugs will rule and thuggery will be the new way of life. Congratulations everyone on this new India and hope you thrive.”
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X