మరో లేడి క్రికెటర్ బయోపిక్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క శర్మ
సినిమా ప్రపంచంలో ప్రస్తుతం బయోపిక్స్ హవా ఆ రేంజ్ లో నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా. క్రికెటర్లకు సంబంధించిన కథలు కూడా తెరపైకి చాలానే వస్తున్నాయి. అందులోనూ లేడి క్రికెటర్లపై సినిమాలు చేయడానికి ఫిల్మ్ మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే మిథాలి రాజ్ బయోపిక్ కోసం తాప్సి సిద్దమవుతున్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు మహిళా టీమిండియా ఆల్ రౌండర్ జులాన్ గోస్వామి లైఫ్ కూడా వెండితెరపైకి రానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి ఈ టాలెంటెడ్ వుమెన్ తో సోని పిక్చర్స్ నిరంతరంగా చర్చలు జరుపుతూనే ఉంది. అయితే జులాన్ గోస్వామి పాత్రను సెలెక్ట్ చేయడానికి మేకర్స్ చాలా మందితో ఆడిషన్స్ చేశారు. ఇక ఫైనల్ గా అనుష్క శర్మ అయితే బెటర్ అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

మధ్యలో కాస్త బ్రేకులు పడ్డప్పటికి మొత్తానికి నిర్మాతలు ఒక డైరెక్టర్ తో ప్లాన్ సెట్ సెట్ చేసినట్లు సమాచారం. ఇక అనుష్క శర్మ ఈ ప్రాజెక్ట్ కోసం మళ్ళీ క్రికెట్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. జులాన్ గోస్వామి బయోపిక్ కాబట్టి ఆమె స్పీడ్ అందుకోవాల్సి ఉంటుంది. వేగంగా బంతులు వేయడమే కాకుండా బ్యాటింగ్ లో కూడా బలంగా బౌండరీలు కొట్టగల జులాన్ గోస్వామి తరహాలో అనుష్క హావభావాలను అలవాటు చేసుకోవాలి అంటే ఐదారు నెలల సమయం పట్టవచ్చు. ఇక ప్రస్తుతం కూతురు వమికా ను చూసుకుంటూ బిజీగా ఉంటున్న అనుష్క మళ్ళీ సినిమాలతో ఎంతవరకు బిజీ అవుతుందో చూడాలి. చివరగా ఆమె జీరో సినిమాలో హీరోయిన్ నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











