రూమ్ లో అలా టచ్ చేశాడు.. దెబ్బకు పరార్.. క్యాస్టింగ్ కౌచ్ అనుభవం బయటపెట్టిన నటి!

ఇండస్ట్రీకి సంబంధించిన వారు అంగీకరించడానికి ఇష్టపడరు కానీ వినోద పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందనే అంటున్నారు దాని బారిన పడిన నటీమణులు.. ఇటీవల ఇంటర్వ్యూలో, తారక్ మెహతా కా ఓల్తా చాష్మా సీరియల్ నటి ఆరాధన శర్మ తన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని మరియు ఆ అనుభవం ఆమెను ఎలా ప్రభావితం చేసిందో వెల్లడించింది. ఒక జాతీయ పత్రికతో ఆమె మాట్లాడుతూ తన కాస్టింగ్ కౌచ్ సంఘటన పంచుకుంది.

''నా కెరీర్ మొదట్లో ఒక సంఘటన జరిగింది. అది నా మొత్తం జీవితంలో నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇది నాలుగైదు సంవత్సరాల క్రితం జరిగింది. నేను అప్పుడు పూణేలో చదువుతున్నాను.'' అని చెప్పుకొచ్చింది. అయితే ఇది నా సొంత ఊరు రాంచీలో జరిగిందని పేర్కొంది. ముంబైలో కాస్టింగ్ చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడని, అప్పుడు నేను పూణేలో మోడలింగ్ చేస్తున్న క్రమంలో తనకి పరిచయం అయ్యాడని చెప్పుకొచ్చింది. అతను ఒక పాత్రలో నటించాల్సి ఉందని చెప్పడంతో నేను రాంచీ వెళ్ళానని, అప్పుడు మేము ఒక గదిలో స్క్రిప్ట్ చదువుతున్నామని ఈ క్రమంలో అతను నన్ను తాకడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చింది.

]

Aradhana Sharma shares Her Casting Couch Experience

అయితే "ఏమి జరుగుతుందో నేను గుర్తించలేకపోయాను. నేను అతనిని నెట్టడం, తలుపు తెరిచి పారిపోవటం నాకు గుర్తుందని అయితే నేను దీన్ని కొన్ని రోజులు ఎవరితోనూ పంచుకోలేకపోయానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ అనుభవం మిమ్మల్ని వృత్తి నుండి దూరం చేసిందా అని అడిగినప్పుడు, ఆరాధన శర్మ ఆసక్తికర వ్యాఖలు చేసింది. అప్పటి నుంచి నాకు నమ్మకమనే సమస్యలు మొదలయ్యాయని చెప్పుకొచ్చింది. నేను ఒక గదిలో ఒక వ్యక్తితో ఉండలేనని, నేను నా తండ్రితో కూడా ఒక గదిలో ఉండలేనని చెప్పుకొచ్చింది. తనకు అప్పుడు 19/20 సంవత్సరాలు ఉన్నాయని, అప్పటి వరకు నన్ను ఎవరూ తాకనివ్వలేదని చెప్పుకొచ్చింది. ఇది నాకు చాలా చెడ్డ అనుభవం అని, నా తల్లి మరియు నేను అతనిని ఎదుర్కోవాలనుకున్నాను, కాని అప్పుడు మా కుటుంబ సభ్యుల భయంతో ఆగిపోయారని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X