For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఉదయం సర్‌ప్రైజ్ అంటూ మాజీ భర్తతో.. సాయంత్రం ప్రియుడితో ఘాటుగా: షాకిస్తోన్న హీరోయిన్ రెండు వీడియోలు

  |

  సినిమాల్లో నటించకున్నా చాలా కాలంగా బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతూ.. దేశ వ్యాప్తంగా తరచూ వార్తల్లో నిలుస్తోన్న భామ మలైకా అరోరా. అప్పుడెప్పుడో కొన్ని సినిమాల్లో భాగం అయిన ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో యాక్టింగ్‌ చేయడం లేదు. కానీ, సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడూ హైలైట్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా తన వ్యవహార శైలితో నిత్యం చర్చనీయాంశంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా తన మాజీ భర్త గురించి పోస్ట్ చేసిన మలైకా.. ఆ వెంటనే ప్రియుడితో కలిసి ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  ఐటం గర్ల్‌గా పాపులర్.. తెలుగులో ఇద్దరు స్టార్లతో

  ఐటం గర్ల్‌గా పాపులర్.. తెలుగులో ఇద్దరు స్టార్లతో


  మోడలింగ్ రంగం నుంచి నేరుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ మలైకా అరోరా. అలా కెరీర్ ఆరంభంలోనే కొన్ని సినిమాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత ఐటం గర్ల్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే ‘ఛయ్య ఛయ్య..', ‘అనార్కలీ డిస్కో ఛాలీ..', ‘మున్నీ బద్నామ్‌ హుయే' వంటి సూపర్ హిట్ హిందీ పాటలతో పాటు తెలుగులో ‘అతిథి', ‘గబ్బర్ సింగ్‌' వంటి చిత్రాల్లో రచ్చ చేసేసింది.

  సల్మాన్ ఖాన్ ఇంటి కోడలిగా.. అలా విడిపోయింది

  సల్మాన్ ఖాన్ ఇంటి కోడలిగా.. అలా విడిపోయింది

  వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే మలైకా అరోరా.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను వివాహమాడింది. అతడితో కలిసి దాదాపు తొమ్మిదేళ్ల పాటు కాపురం చేసింది. ఈ క్రమంలోనే ఈ జంటకు ఓ బాబు కూడా జన్మించాడు. ఆ తర్వాత 2017లో వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులిచ్చింది మలైకా.

  12 ఏళ్లు చిన్నవాడైన స్టార్ హీరోతో మలైక డేటింగ్

  12 ఏళ్లు చిన్నవాడైన స్టార్ హీరోతో మలైక డేటింగ్

  భర్తకు దూరమైన తర్వాత కొద్ది రోజులకే బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ ప్రారంభించింది మలైకా. తనకంటే వయసులో 12 ఏళ్లు చిన్నవాడైనప్పటికీ.. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. చాలా కాలం పాటు రహస్యంగానే వ్యవహారాన్ని నడిపిన ఈ జంట.. కొద్ది రోజులకు ఓపెన్ అయిపోయింది. దీనికి కారణం ‘అర్జున్ నావాడు' అని మలైకా అరోరా పోస్టు చేయడమే.

  ఎప్పుడూ కలిసే.. నిత్యం అతడి గురించే పోస్టులు

  ఎప్పుడూ కలిసే.. నిత్యం అతడి గురించే పోస్టులు

  మలైకా బయట పెట్టిన కొద్ది రోజులకే అర్జున్ కపూర్ కూడా తమ బంధాన్ని రివీల్ చేసేశాడు. దీంతో అప్పటి నుంచి వీళ్లిద్దరూ బహిరంగంగానే తిరుగుతున్నారు. ఎప్పుడూ కలిసే ఉంటూ.. కలిసే తిరుగుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టేశారు. అప్పటి నుంచి ఎప్పుడూ అర్జున్ కపూర్ గురించే పోస్టులు పెడుతూ వస్తోందీ ముదురు భామ.

  మాజీ భర్త నుంచి ఊహించని గిప్ట్... వీడియో షేర్

  మాజీ భర్త నుంచి ఊహించని గిప్ట్... వీడియో షేర్


  మలైకా అరోరా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఓ వీడియో అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. దీనికి కారణం ఆమె చేసిన పోస్టు తన మాజీ భర్తకు సంబంధించినది కావడమే. చాలా కాలం క్రితమే విడుపోయినప్పటికీ.. అర్భాజ్ ఖాన్‌ తాజాగా తన మాజీ భర్త అయిన మలైకకు మామిడి కాయలను గిఫ్టుగా పంపించాడు. దీంతో అతడికి థ్యాంక్స్ చెబుతూ పోస్టు పెట్టిందామె.

  #CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
  సాయంత్రం ప్రియుడితో ఎంజాయ్... ఫోటో వైరల్

  సాయంత్రం ప్రియుడితో ఎంజాయ్... ఫోటో వైరల్


  బుధవారం సాయంత్రం బాలీవుడ్ ప్రముఖలంతా కలిసి ఓ పార్టీలో కలుసుకున్నారు. దీనికి తన ప్రియుడు అర్జున్ కపూర్‌తో కలిసి హాజరైంది మలైకా అరోరా. అంతేకాదు, అక్కడ చాలా సేపు చిల్ అవుతూ ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఒకే రోజు ఇద్దరితో ఆమె వ్యవహరించిన తీరు అందరికీ షాకిస్తోంది.

  English summary
  Malaika Arora received a special present from her ex-husband Arbaaz Khan -- a box of fresh mangoes. She took to Instagram to share a video of the gift and thanked him for the gesture. “Thank u arbaazkhanofficial aam.wallah for the freshest mangoes that u can order online,” she wrote on Instagram stories, along with a sticker that read ‘order now’.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X