Malaika Arora తో బ్రేకప్.. ప్రియురాలితో డేటింగ్‌పై అర్జున్ కపూర్ క్లారిటీ

బాలీవుడ్‌లో పాపులర్ లవ్ ‌బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమాయణం కొన్నేండ్లుగా హాట్ టాపిక్‌గా మారడం, పలు రకాల కథనాలు వెలువడటం తెలిసిందే. తనకంటే వయసులో పెద్ద, అంతేకాకుండా ఇప్పటికే విడాకులు పొందిన మలైకా అరోరాతో డేటింగ్ వ్యవహారం రసపట్టుగా సాగుతున్నది. గత మూడేళ్లుగా డేటింగ్ చేస్తూ మీడియా కంటికి అనేక మార్లు చిక్కడం తెలిసిందే. అయితే తాజాగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోయారనే వార్త ముంబై మీడియాలో వైరల్ అయింది. ఈ వార్తలు జాతీయ మీడియాలో కూడా హల్‌చల్ చేశాయి. అయితే మలైకా అరోరాతో బ్రేకప్ గురించి అర్జున్ కపూర్ స్పందించడంతో బ్రేకప్ విషయంపై క్లారిటీ వచ్చింది.

మలైకా అరోరాతో బ్రేకప్ వార్తలను అర్జున్ ఖండిస్తూ ఆ వార్త పసలేని రూమర్ అంటూ కొట్టిపడేశాడు. తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెడుతూ.. ఇలాంటి రూమర్లకు స్థానం లేదు. కరోనావైరస్ పరిస్థితుల్లో క్షేమంగా ఉంది. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని కోరుకొంటున్నాను. ఎప్పటి మాదిరిగానే ప్రేమను కురిపించండి అంటూ అర్జున్ కపూర్ మెసేజ్ పెట్టి.. మలైకాతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు.

Arjun Kapoor Clarity on break up with Malaika Arora

అర్జున్ కపూర్ తన అఫైర్ విషయం గురించి క్లారిటీ ఇస్తూ ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టిన పోస్టుపై బాలీవుడ్ తారలు సోనాల్ చౌహన్, తారా సుతారియా, మోహిత్ రాయ్, సోఫీ చౌదరీ లాంటి తారలు స్పందించారు. తారా సుతారియా స్పందిస్తూ.. మీకు అర్ధమైందా బాబులు అంటూ కామెంట్ చేసింది.

ఇక అర్జున్ కపూర్ క్లారిటీతో వారిద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని, వారిని విడదీయడం ఇప్పట్లో సాధ్యపడని పని అనే కామెంట్లు సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో బ్రేకప్ అయిందని సంతోష పడిన ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది.

ఇదిలా ఉంటే.. అర్జున్ కపూర్ కెరీర్ 2021లో బ్రహ్మండంగా ముగిసింది. సందీప్ ఔర్ పింకి ఫరార్, సర్దార్ కా గ్రాండ్ సన్, భూత్ పోలీస్ సినిమాలతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X