»   » అర్జున్ కపూర్ ప్రేమతో బోని ఎమోషనల్, చెల్లెళ్ళ కోసం, ఫ్యామిలిలో ఊహించని పరిణామాలు!

అర్జున్ కపూర్ ప్రేమతో బోని ఎమోషనల్, చెల్లెళ్ళ కోసం, ఫ్యామిలిలో ఊహించని పరిణామాలు!

Subscribe to Filmibeat Telugu
Arjun Kapoor feels Boney, Janhvi, Khushi need him

శ్రీదేవి మరణం తరువాత బోనికపూర్ కుటుంబంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శ్రీదేవి మరణం ఎలా ఉహించని విధంగా జరిగిందో, అదేవిధంగా అర్జున్ కపూర్, అన్షులా ఊహించని విధంగా తండ్రి కుటుంబానికి చేరువవుతున్నారు. శ్రీదేవి మరణం తరువాత అర్జున్ కపూర్, అన్షులా తండ్రి బోనికపూర్ తో పాటు చెల్లెళ్ళు జాన్వీ, ఖుషికి మానసిక స్థైర్యాన్ని అందించి వారికి అండగా నిలిచారు. అర్జున్ కపూర్ పూర్తిగా తండ్రి కుటుంబానికి దగ్గరయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ మేరకు బాలీవుడ్ లో వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి.

 తండ్రి కుటుంబానికి చేరువగా

తండ్రి కుటుంబానికి చేరువగా

అర్జున్ కపూర్ కొద్దిరోజుల క్రితం వరకు తండ్రి బోనికపూర్ తో అంటి ముట్టనట్లు ఉన్నారు. కానీ శ్రీదేవి మరణం తరువాత పరిస్థితి పూర్తిగా మారినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

 తండ్రి, చెల్లెళ్ళ కోసం

తండ్రి, చెల్లెళ్ళ కోసం

శ్రీదేవి మరణం తరువాత బోనికపూర్ కుటుంబంలో నెలకొన్న ఎమోషనల్స్ తో అంతా ఒక్కటైపోతున్నట్లు సంకేతాల అందుతున్నాయి. అర్జున్ కపూర్ తండ్రితో కలసి కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. తల్లిని కోల్పోయి బాధలో ఉన్న జాన్వీ, ఖుషిని కూడా అర్జున్ కపూర్ చేరదీసే ప్రయత్నాలు చేతునట్లు వార్తలు వస్తున్నాయి.

 జాన్వీ పుట్టినరోజుకు

జాన్వీ పుట్టినరోజుకు

జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా అర్జున్ కపూర్ సోదరి అన్షులా కూడా హాజరయ్యింది. ఇంగ్లాడ్ లో తన సోదరుడు అర్జునకపూర్ నటిస్తున్న నమస్తే ఇంగ్లాడ్ చిత్రానికి అన్షులా పని చేస్తోంది. జాన్వీ పుట్టిన రోజు సంధర్భంగా అన్షులా ఇంగ్లాండ్ నుంచి ముంబై రావడం విశేషం.

 ఎమోషనల్ అవుతున్న బోనికపూర్

ఎమోషనల్ అవుతున్న బోనికపూర్

తనకోసం, జాన్వీ, ఖుషి కోసం అర్జున్ కపూర్, అన్షులా ఎనలేని ప్రేమ చూపిస్తుండడంతో బోనికపూర్ ఎమోషనల్ అవుతున్నారట. చెల్లెళ్లకు బాధ్యతగల అన్నలా అర్జున్ కపూర్ చేరువవుతుండడంతో బోని కపూర్ సంతోషించే అంశం అని అంటున్నారు.

 అంత్యక్రియల్లో ముందుండి నడిపించారు

అంత్యక్రియల్లో ముందుండి నడిపించారు

శ్రీదేవి అంత్యక్రియల నేపథ్యంలో అర్జున్ కపూర్, అన్షులా చూపిన చొరవ మరిచిపోలేనిది, వాళ్లిద్దరూ శిఖరంలా తమకు అండగా నిలిచారని బోనికపూర్ స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

English summary
Arjun Kapoor move in with half-sisters Janhvi and Khushi. Emotional movement for Boney Kapoor
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu