శ్రీదేవితో బోనీ పెళ్లిపై ఓపెన్ అయిన అర్జున్‌కపూర్.. ఓకే అని ఎలా చెప్తా?.. అంతా అమ్మ వల్లనే!
శ్రీదేవికి బోనీ కపూర్‌తో పెళ్లి కాకముందే ఆయనకు మరో మహిళతో వివాహం జరిగింది. మోనా శౌరే అనే ఆవిడతో ఆయనకు ముందు పెళ్లయింది. వారికి కుమారుడు అర్జున్ కపూర్, కుమార్తె అన్శులా కపూర్ ఉన్నారు. శ్రీదేవి మరణం దాకా కూడా అర్జున్ కపూర్తో అంత మంచి సంబంధాలు లేవు. ఆయన హీరోగా ఎదిగినప్పటికీ.. ఎప్పుడూ తన సవతి తల్లితో ఎదురుగా కూర్చుని మాట్లాడలేదు అని అర్జున్ చెబుతూ ఉంటారు. తాజాగా ఆయన శ్రీదేవితో వివాహం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే

శ్రేదేవి మరణం ముందు వరకు
బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్ తన కుటుంబ సంబంధాల గురించి ఎప్పుడూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. భారత సినిమా రంగానికే మొదటి మహిళా సూపర్ స్టార్ గా నిలిచిన శ్రీదేవి మరణించిన తరువాత, అర్జున్ తన తండ్రి బోనీ కపూర్ మరియు సోదరీమణులు జాన్వి, ఖుషిలకి అండగా నిలబడ్డాడు. శ్రీదేవి మరణం తరువాత అర్జున్ కపూర్ తన చెల్లెళ్లకు బాగా చేరువయ్యాడు. అప్పటివరకు అర్జున్ కపూర్ కి శ్రీదేవి కుటుంబానికి కొంత గ్యాప్ ఉండేది. శ్రీదేవి మరణించిన సమయంలో తన అన్ని కార్యక్రమాలు అర్జున్ కపూర్ దగ్గరుండి జరిపించాడు.

ప్రేమలో పడడాన్ని గౌరవిస్తా
తన తండ్రి మరోసారి ప్రేమలో పడటాన్ని గౌరవిస్తానన్న ఆయన ప్రేమ సంక్లిష్టమైనది అని అన్నారు. బాలీవుడ్‌లో ఇది చాలా సందర్భాల్లో జరుగుతుందన్న ఆయన ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఒకేసారి మాత్రమే ప్రేమలో పడగలమని చెబితే అది ఫూలిష్‌నెస్ అవుతుందని అన్నారు. మీరు ఎవరితోనైనా ప్రేమలో పడి ఉండవచ్చు. ఆ తర్వాత మీరు మరోసారి ప్రేమలో పడొచ్చు. కానీ దాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రేమ గురించి తెలియాలని అన్నారు.

తల్లి బాధపడింది
గతంలో తన తండ్రితో గల సంబంధం దెబ్బ తినడంపై కూడా అర్జున్ కపూర్ స్పందించారు. శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి తన తండ్రి బోనీ కపూర్ వెళ్లి పోయినప్పుడు తన తల్లి ఎంతగానో బాధపడింది అని ఆయన చెప్పాడు. శ్రీదేవిపై తనకు గౌరవం ఉందని, తన తండ్రి బోనీ కపూర్‌కు తనను చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించారని అతను వివరించాడు.

ఎలా అంగీకరించగలను
ఇక ఈ నటుడు ఇటీవల ఈ అంశం మీద ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రెండో పెళ్లి గురించి మాట్లాడిన ఆయన దానిని ఎలా అంగీకరించగలను అని ప్రశ్నించారు. ఈ విషయం గురించి విన్న వెంటనే "నా తల్లి పెంపకమే గుర్తు వచ్చిందని, మనం ఏ అడ్డంకులను ఎదుర్కొన్నా సరే తండ్రి పక్షాన ఉండమని ఆమె నాకు చెప్పేదని ఆయన అన్నారు. ఆయన ఎలా పడ్డారో తెలియదు కానీ ప్రేమలో పడ్డారని అన్నారు.
Recommended Video

నేను దాని ఫలితాలను అనుభవించా
నా తండ్రి చేసిన పనితో నేను బాగానే ఉన్నానని చెప్పలేను, ఎందుకంటే చిన్నతనంలో నేను దాని ఫలితాలను అనుభవించాను, కానీ నేను ఇప్పుడు నేను అర్థం చేసుకున్నానని అన్నారు. మంచి కొడుకుగా ఉండమని నా తల్లి కోరుకునేది అని అర్జున్ కపూర్ అన్నారు. ఇక బాలీవుడ్‌లో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ కపూర్ ప్రస్తుతం బూట్ పోలీస్, ఏక్ విలన్ రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే మరోవైపు ఆయన నటి మలైకా అరోరాతో ప్రేమలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











