ఛీ మరీ ఇంత నీచంగా వార్తలు రాస్తారా?.... చెల్లికి అండగా నిలిచిన హీరో!
Recommended Video

శ్రీదేవి మరణం తర్వాత కపూర్ ఫ్యామిలీలో చాలా మార్పులు వచ్చాయి. అప్పటి వరకు అంటీ ముట్టనట్లుగా ఉండే బోనీ కపూర్ మొదటి భార్య, రెండో భార్య పిల్లలు ఒక్కటైపోయారు. అర్జున్ కపూర్, అన్షులా కపూర్....తమ చెల్లెళ్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్ మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న జాహ్నవి మీద మీడియాలో ఏవైనా అభ్యంతరక వార్తలు వస్తే అస్సలు సహించడం లేదు. అర్జున్ కపూర్ అయితే ఈ విషయంలో ట్విట్టర్ ద్వారా సీరియస్ వార్నింగులు ఇస్తుండటం గమనార్హం. చెల్లిపై తప్పుడు కూతలు కూసిన మీడియాపై మరోసారి అర్జున్ భగ్గుమన్నాడు.

వివాదానికి కారణమైన ఫోటో ఇదే
జాహ్నవి కపూర్ ఇటీవల చిట్టి పొట్టి డ్రెస్సులో హాట్ లుక్ తో మీడియా కెమెరాలకు చిక్కింది. అయితే ఈ ఫోటోపై ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక ప్రచురించిన కథనం అర్జున్‌కు కోపం తెప్పించింది. ‘జాహ్నవి ఈ డ్రెస్సులో చాలా అందంగా ఉంది కానీ ఫ్యాన్స్ ఆమె ప్యాంటు వేసుకోవడం మరిచిపోయిందని భావిస్తున్నారు' అనే అర్థం వచ్చేలా వార్త ప్రచురించడంతో అర్జున్ కపూర్ ఫైర్ అయ్యాడు.

ఇంత నీచంగా రాస్తారా అంటూ..
ఒక పెద్ద మీడియా సంస్థ సినిమా వారి గురించి చాలా నీచంగా రాయడం బాధేసింది. జనాల్లో లేని ఆలోచనలు మీరే కల్పిస్తున్నారు అంటూ మండి పడ్డారు. ఈ విషయంలో తన చెల్లి జాహ్నవికి పూర్తి మద్దతుగా నిలిచాడు.

గతంలో బూతులు ప్రయోగించిన అర్జున్
గతంలో కూడా జాహ్నవి కపూర్ మీద మీడియాలో అభ్యంతరకర వార్తలు రావడంతో అర్జున్ కపూర్ బూతులు తిడుతూ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. సినీ సెలబ్రిటీలను మీడియా అసభ్యంగా చిత్రీకరించి సొమ్ము చేసుకోవడాన్ని అర్జున్ కపూర్ తప్పుబట్టారు.

శ్రీదేవి మరణం తర్వాత మారిన పరిస్థితులు
శ్రీదేవి మరణానికి ముందు అర్జున్ కపూర్ మీడియాతో మాట్లాడుతూ..... తన తండ్రి రెండో భార్య, పిల్లలతో తాము ఎక్కువగా కలవడమని, వారితో గడిపిన సందర్బాలు కూడా చాలా తక్కువ అని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీదేవి మరణం తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఆమె మరణించిన సమయంలో అర్జున్ కుటుంబానికి చాలా సపోర్టుగా నిలిచారు. జాహ్నవి, ఖుషిని.... తన సొంత సోదరిలా ట్రీట్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











