twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రేకింగ్: Aryan Khan బెయిల్ పిటిషన్ కొట్టివేత.. షారుక్‌కు షాక్.. కొత్త కోణంతో డ్రగ్ కేసు మరో మలుపు

    |

    డ్రగ్స్ కేసులో అరెస్టైన తన కుమారుడికి బెయిల్ నిరాకరిస్తూ ఎన్డీపీఎస్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. ముంబై గోవా క్రూయిజ్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఆర్యన్ ఖాన్‌ను బెయిల్ పిటిషన్ కోర్టు విచారించింది. అయితే ఆర్యన్ ఖాన్‌కు ఇంటర్నెషనల్ రాకెట్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయంటూ ఎన్సీబీ బలంగా వాదనలు వినిపించడంతో కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తన కుమారుడి బెయిల్ కోసం ప్రముఖ లాయర్‌ను షారుక్ ఖాన్ రంగంలోకి దించినా ఉపశమనం దక్కలేకపోవడం గమనార్హం. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

     కోర్టులో బలంగా వాదోపవాదాలు

    కోర్టులో బలంగా వాదోపవాదాలు

    డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్యన్ ఖాన్, మరో ఇద్దరి బెయిల్ కోసం ముంబైలోని ఎన్డీపీఎస్ కోర్టులో ఇరుపక్షాల మధ్య వాదనలు జరిగాయి. ఎన్సీబీ వాదనలు విన్న తర్వాత ఆర్యన్ ఖాన్‌, అర్బాజ్ మర్చంట్, మునుమున్ దమేచా బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. వీరిపై నేరపూరిత కుట్ర, డ్రగ్స్ వినియోగం, కొనుగోల లాంటి ఆరోపణలపై పలు సెక్షన్లపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

    విదేశీ డ్రగ్ రాకెట్‌తో సంబంధాలు

    విదేశీ డ్రగ్ రాకెట్‌తో సంబంధాలు

    అయితే ముంబై కోర్టులో ఆర్యన్ ఖాన్‌కు ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్‌తో ఉన్న సంబంధాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. విదేశీ డ్రగ్స్ సరఫరాదారులతో ఆర్యన్ ఖాన్‌‌కు ఉన్న సంబంధాలను వాట్సాప్ ఛాటింగ్ రూపంలో సాక్ష్యాలను కోర్టుకు అందజేశారు. ఈ వ్యవహారం విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తున్నట్టు కోర్టుకు విన్నవించారు. దాంతో బెయిల్ నిరాకరించడానికి ప్రధాన కారణంగా కనబడినట్టు సమాచారం.

     హీరోయిన్‌తోపాటు మరికొందరికి లింకులు

    హీరోయిన్‌తోపాటు మరికొందరికి లింకులు

    ఇక బాలీవుడ్ హీరోయిన్‌తో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వ్యవహారం ఈ కేసులో కొత్త కోణంగా మారింది. అంతేకాకుండా తాజా ఆరెస్టుల తర్వాత పలువురు బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్ రాకెట్‌కు ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాతను ప్రశ్నిస్తున్న సమయంలో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేయడం సరికాదని ఎన్సీబీ వర్గాలు బలమైన వాదనలు వినిపించినట్టు తెలిసింది.

     తీవ్ర నిరాశలో షారుక్ కుటుంబం

    తీవ్ర నిరాశలో షారుక్ కుటుంబం

    డ్రగ్స్ కేసులో 17 రోజులుగా ముంబై ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్న ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వకపోవడంపై షారుక్ ఖాన్ కుటుంబం, ఆయన సన్నిహితులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఆయన తరపున న్యాయవాదులు దర్యాప్తు, విచారణలో జరుగుతున్న జాప్యాన్ని ఎండగడుతున్నారు. షారుక్ ఖాన్‌పై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలను సన్నిహితులు సంధిస్తున్నారు.

    హైకోర్టులో బెయిల్ పిటిషన్‌కు ప్రయత్నం

    హైకోర్టులో బెయిల్ పిటిషన్‌కు ప్రయత్నం

    అయితే ఆర్యన్ ఖాన్‌కు ముంబై ఎన్డీపీఎస్ కోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో షారుక్ ఖాన్ కుటుంబం, వారి తరపు న్యాయవాదులు ప్రస్తుతం సరికొత్త వ్యూహ్యాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్టీపీఎస్ కోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో బాంబే హైకోర్టుకు వెళ్లాలని లాయర్లు నిర్ణయించారు. త్వరలోనే ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మరికొన్ని రోజులు ఆర్యన్ ఖాన్ ఆర్థర్ రోడ్డు జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఆర్యన్ ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే.

    Recommended Video

    Naveen Polishetty ఎమోషనల్ కామెంట్స్ On Sushant Singh Rajput
    అక్టోబర్ 2న ఏడుగురు అరెస్ట్

    అక్టోబర్ 2న ఏడుగురు అరెస్ట్


    అక్టోబర్ 2వ తేదీన ముంబై గోవా క్రూయిజ్‌లో ఆర్యన్ ఖాన్‌తోపాటు ఆయన స్నేహితుడు, నటుడు అర్బాజ్ మర్చంట్; మున్‌మున్ దమేచా, నుపూర్ సతీజా, ఇష్మీత్ చద్దా, మోహన్ జైస్వాల్, గోమిత్ చోప్రాం, విక్రాంత్ చోకర్ ఉన్నారు. మున్ మున్ మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అని తెలిసింది.

    English summary
    Bollywood Super star Shah Rukh Khan‘s son Aryan has been denied bail by the special NDPS court today. The bail application filed by two other accused, arrested along with Aryan in the Mumbai cruise ship drugs bust case, has also been rejected.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X