Aryan Khan సమీర్ వాంఖడే దూకుడు.. డ్రగ్స్ దందాలో కొత్త కోణం.. షారుక్ కొడుకు మొబైల్ ఫోన్లు అక్కడికి!

బాలీవుడ్‌తో డ్రగ్స్ దందా కోణంలో దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సప్లయర్లపై కొరడా ఝళిలిస్తున్నది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను దర్యాప్తులో కీలకంగా మార్చుకోవడానికి ఎన్సీబీ సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ మొబైల్ ఫోన్‌లో ఉన్న సమాచారాన్ని, ఫోటోలను, వీడియోలను పరీశీలించడానికి, దర్యాప్తులో కీలకంగా మార్చడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఆర్యన్ ఖాన్ మొబైల్ ఫోన్‌లో కీలకంగా

ఆర్యన్ ఖాన్ మొబైల్ ఫోన్‌లో కీలకంగా

ముంబై, గోవా క్రూయిజ్‌లో మెరుపుదాడులు చేసిన తర్వాత ఆర్యన్ ఖాన్‌ నుంచి ఎన్సీబీ అధికారులు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఆ ఫోన్‌లోని వాట్పాప్ ఛాట్స్ ద్వారా ప్రాథమికంగా కేసు నమోదు చేశారు. ఆ ఫోన్‌లోని కొన్ని అంశాలను సాక్ష్యాలుగా వాడుకొన్నారు. అయితే ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది సతీష్ మాన్‌షిండే మాత్రం వాట్సప్ ఛాట్స్ ఆధారంగా కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎన్సీబీ అధికారులు వ్యవహరిస్తున్నారని కోర్టుకు వెల్లడించారు.

గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ లాబోరేటరికి

గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ లాబోరేటరికి

అయితే ఆర్యన్ ఖాన్ నుంచి స్వాధీనం చేసుకొన్న మొబైల్ ఫోన్లను గుజరాత్‌లోని గాంధీనగర్ లాబోరేటరికి ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు. ఆర్యన్ ఫోన్‌లో షాకింగ్, సంచలనాత్మకమైన రీతిలో సాక్ష్యాలు లభించాయని ముంబై సిటీ కోర్టుకు ఎన్సీబీ వెల్లడించిన నేపథ్యంలో ఎన్సీబీ ఈ నిర్ణయం తీసుకొన్నది. ఆర్యన్ ఖాన్‌కు ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ సంబంధాలను ఫొరెన్సిక్ నిపుణుల ద్వారా మరింత క్లారిటీ తెచ్చుకొనేందుకు, అవి కోర్టుకు వెల్లడించానికి ఎన్సీబీ ప్రయత్నిస్తున్నది.

దూకుడు ప్రదర్శిస్తున్న సమీర్ వాంఖడే

దూకుడు ప్రదర్శిస్తున్న సమీర్ వాంఖడే

ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆర్యన్, ఇతరులను విచారించిన క్రమంలో వెల్లడైన సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులకు సిద్దమయ్యారు. ఆర్యన్ అరెస్ట్ తర్వాత మంగళవారం మరో నలుగురిని అరెస్ట్ చేశాం. దాంతో ఈకేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య
కు పెరిగింది. విచారణ వేగవంతంగా కొనసాగుతున్నది అని సమీర్ వాంఖడే మీడియాకు అధికారికంగా వెల్లడించారు.

బిట్ కాయిన్స్ ద్వారా చెల్లింపులు

బిట్ కాయిన్స్ ద్వారా చెల్లింపులు


అయితే ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాతో ఆర్యన్ ఖాన్‌కు సంబంధాలు ఉన్నాయనే అనుమానాలను ఎన్సీబీ వ్యక్తం చేస్తున్నది. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి చెల్లించిన మొత్తాలు మరింత అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. డ్రగ్స్ కొనుగోలుకు బిట్ కాయిన్స్ ఉపయోగించారనే అనుమానాన్ని ఇటీవల వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్‌లో కొన్ని కోడ్ భాషలను ఉపయోగించారు. వాటిని డీ కోడ్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Recommended Video

Supyaardee Singh & Aryan Krishna Interview Part 3 | Cheppina Evaru Nammaru
ఆర్యన్ ఖాన్‌ బెయిల్‌పై 7న విచారణ

ఆర్యన్ ఖాన్‌ బెయిల్‌పై 7న విచారణ

అయితే ఆర్యన్ ఖాన్‌ను అక్టోబర్ 7వ తేదీ వరకు ఎన్సీబీ కస్టడీకి అప్పగిస్తూ ముుంబై సిటీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం జరిగే విచారణ కోసం ఆర్యన్‌ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో షారుక్ ఖాన్ తన కుమారుడికి బెయిల్ లభించేలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అక్టోబర్ 7వ తేదీన ఆర్యన్‌కు బెయిల్ లభించే అవకాశం ఉందనే ఉహాగానాలు ముంబై మీడియాలో బలంగా కనిపిస్తున్నాయి.

అయితే దర్యాప్తు కీలక దశలో ఉంది కాబట్టి మరికొన్ని రోజులు ఆర్యన్‌ను తమ కస్టడీలోనే ఉంచాలని ఎన్సీబీ అధికారులు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితులకు కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X