twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాహ్ బాద్షా.. మానవత్వాన్ని ప్రదర్శించిన షారుక్.. నాలుగు అంతస్థుల భవనాన్ని..

    |

    బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మరోసారి మానవత్వాన్ని చాటుకొన్నారు. కరోనా సంక్షోభంలో దేశం కూరుకుపోయిన సమయంలో ప్రజల కోసం తాను ఉన్నానని నిరూపించారు. ఇప్పటికే ప్రధాని నిధికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించిన షారుక్.. కరోనా బారిన పడిన బాధితులను ఆదుకోనేందుకు నడుం బిగించారు. ప్రస్తుతం షారుక్ తీసుకొన్న నిర్ణయంపై పలు వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

    కరోనా సమయంలో

    కరోనా సమయంలో

    కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రజల పక్షాన నిలిచారు. ఆరోగ్యపరమైన సేవ అందించే సామాజిక సంస్థలకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఇక్విప్‌మెంట్స్‌ను అందించారు. ఏక్‌సాథ్: ది ఎర్త్ ఫౌండేషన్, రోటి ఫౌండేషన్ అండ్ వర్కింగ్ పీపుల్స్ చార్టర్‌కు అండగా నిలిచారు. ఆయనతోపాటు భార్య గౌరీ ఖాన్ కూడా సేవ కార్యక్రమంలో తన వంతు సాయం అందిస్తున్నారు.

    ఢిల్లీ, బెంగాల్ సీఎంలకు సహాయం

    ఢిల్లీ, బెంగాల్ సీఎంలకు సహాయం

    ఇవియే కాకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తన వంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా సహాయ కార్యక్రమంలో ఆర్థికంగాను, వైద్యపరమైన సేవలకు సాయం చేస్తానని మాట ఇచ్చారు. ఇలా కరోనా సంక్షోభ సమయంలో మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.

    ఆఫీస్‌ను క్వారంటైన్ ఫెసిలిటీగా

    ఆఫీస్‌ను క్వారంటైన్ ఫెసిలిటీగా

    ఇదిలా ఉండగా, షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులు తమ ఆఫీస్‌ను క్వారంటైన్ ఫెసిలిటీగా మలిచారు. నాలుగు అంతస్థుల కార్యాలయాన్ని కరోనా స్వీయ నిర్బంధ కేంద్రంగా ఉపయోగించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) అప్పగించారు. ఈ ఆఫీస్‌లో చిన్నారులకు, మహిళలకు, పెద్దలకు సాయం అందించే దిశగా చర్యలు చేపట్టారు.

    బీఎంసీ ట్వీట్ చేస్తూ..

    బీఎంసీ ట్వీట్ చేస్తూ..

    షారుక్ ఖాన్ దంపతులు చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమంపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) స్పందిస్తూ.. కరోనాపై పోరాటానికి చేస్తున్న మా ప్రయత్నాలను మరింత బలోపేతం చేశారు. వారి నాలుగు అంతస్తులు భవనాన్ని క్వారంటైన్ ఫెసిలిటిగా మలిచారు. అందుకు వారిద్దరికి థ్యాంక్స్ చెప్పుకొంటున్నాం అని అధికారులు పేర్కొన్నారు.

    Recommended Video

    Anupam Kher Vs Naseeruddin Shah || Anupam Kher Slams Naseeruddin Shah ||

    షారుక్ స్పందించిన తీరు..

    షారుక్ అప్పగించిన నాలుగు అంతస్థుల భవనంలో పిల్లలు, మహిళలు, పెద్దలకు ఆశ్రయం అందించేందుకు వీలు కలుగుతుంది. ఈ భవనంలో వారికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేశారు. సరైన సమయంలో బాధితులకు ఉపయోగ పడాలనే సేవా దృక్పథం మా హృదయాలను కరిగించింది. అంటూ అధికారులు ట్వీట్ చేశారు.

    English summary
    Bollywood badshah Shah Rukh Khan, Gauri Khan has given his office for quarantine facility. On this occassion, BMC tweet that We thank iamsrk & gaurikhan for offering their 4-storey personal office space to help expand our Quarantine capacity equipped with essentials for quarantined children, women & elderly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X