Just In
- 18 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 27 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 1 hr ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
టీమిండియా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది.. ఓడించడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్షయ్ కుమార్ కుటుంబంలో విషాదం.. షాక్‌లో ఏక్తా కపూర్, బాలీవుడ్
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. అక్షయ్ కజిన్, టెలివిజన్ నటుడు, కహానీ ఘర్ ఘర్ కీ ఫేం సచిన్ కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ఈ విషాద ఘటన లాక్‌డౌన్ కారణంగా ఆలస్యంగా మీడియాకు చేరింది. సచిన్ కుమార్ మృతికి పలువురు బాలీవుడ్, టెలివిజన్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకొన్న సచిన్ కుమార్ మృతి గురించి..

నిద్రలోనే కన్నుమూసిన సచిన్
సచిన్ కుమార్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. అయితే అనుకోకుండా నటుడిగా మారారు. ఈ క్రమంలో మే 15వ తేదిన తన గదిలోకి వెళ్లి తలుపు బిగించుకొని పడకపై చేరిన ఆయన నిద్రలో మరణించారు. మరుసనటి రోజు డోర్ తీయకపోవడంతో పనిమనుషులు అనుమానం వచ్చి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ వార్తను సచిన్ కుమార్ స్నేహితుడు రాకేష్ పాల్ మీడియాకు వెల్లడించారు.

సచిన్ మరణ వార్త తెలిసిన వెంటనే
సచిన్ మరణ వార్త తెలిసిన వెంటనే సచిన్ తల్లి, అక్షయ్ కుమార్ తన ఇంటికి చేరుకొన్నారు. హాస్పిటల్‌కు తరలించగా ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. లాక్‌డౌన్ ఆంక్షలను అనుసరించి సచిన్ అంత్యక్రియలు ముంబైలో ముగించారు. సచిన్ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే చివరి వీడ్కోలు పలికారు.

రెండు రోజుల క్రితమే బర్త్ డే
అక్షయ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడైన సచిన్ కుమార్ రెండు రోజుల క్రితమే మే 13న జన్మదినం జరుపుకొన్నారు. ఆ తర్వాత రెండు రోజులకే సినీ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తూ మరణించడంతో సన్నిహితులు దు:ఖంలో మునిగిపోయారు. ఈ వార్త తెలిసిన వెంటనే కహానీ ఘర్ ఘర్ కీ నిర్మాత ఏక్తా కపూర్ షాక్ గురయ్యారు.

అంత్యక్రియలకు ప్రముఖుల దూరం
సచిన్ మృతి ఆలస్యంగా తెలియడంతో పలువురు ఆయనకు శ్రద్దాంజలి ఘటించలేకపోయారు. ముంబైలో పరిస్థితులు సానుకూలంగా లేకపోవడం వల్ల ప్రముఖులంతా సోషల్ మీడియాలోనే సంతాపం ప్రకటించారు. సచిన్ ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధించారు.

సచిన్ కహానీ ఘర్ ఘర్ కీ.. ద్వారా
అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ సీరియల్ కహానీ ఘర్ ఘర్ కీ సీరియల్ ద్వారా సచిన్ నటుడిగా గుర్తింపు పొందారు. బాలీవుడ్‌లో లజ్జా అనే చిత్రంలో నటించారు. పలు చిత్రాల్లో కొన్ని పాత్రలు ధరించినా.. పెద్దగా గుర్తింపు దక్కకపోవడంతో తన ఫొటోగ్రఫి వృత్తికే పరిమితమయ్యారు. సచిన్ గొప్ప మానవతా దృక్పథం కలిగిన వ్యక్తి అని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.