ప్రతి ఏడాది రూ.1.25 కోట్ల విరాళం.. వాళ్లకి అక్షయ్ కుమార్ దేవుడే.. ఏంటంటే?

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ చిత్రాలతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. 1991 నుంచి చిత్ర పరిశ్రమలో అక్షయ్ కుమార్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ 100కు పైగా సినిమాల్లో నటించారు. కామెడీ, యాక్షన్, లవ్, ఫ్యామిలీ డ్రామా వంటి దాదాపు అన్నీ జొనర్లను అక్షయ్ కుమార్ టచ్ చేశారు. దీంతో అక్షయ్ కుమార్ కు అన్ని వర్గాల నుంచి ప్రేక్షకులు ఉండటం విశేషం.

ఇక Akshay Kumar తన అభిమానుల ఇష్టాల మేరకే సినిమాలు చేస్తూ ఉంటారు. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు మంచి కథలను అందించడంలో ముందుంటారు. ఇక అక్షయ్ కుమార్ కు నార్త్ లో డై హార్ట్ ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. మరోవైపు అక్షయ్ కుమార్ ను కూడా అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో కంట్రోల్ చేస్తుంటారు. గతంలో అక్షయ్ కుమార్ ఒక గుట్కా తయారీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ యాడ్ ఫిల్మ్ లో నటించినందుకు వెంటనే అక్షయ్ కుమార్ ను ఆ బ్రాండ్ నుంచి తప్పుకునేలా చేశారు అభిమానులు. అంతలా అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ కు, ప్రేక్షకుల ప్రేమకు కట్టుబడి ఉంటారు.

Bollywood Actor Akshay Kumar Spending Crores of Rupees on Stuntmens Every Year

అక్షయ్ కుమార్ పట్ల బాలీవుడ్ ప్రముఖులు కూడా ఎప్పుడూ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటుంటారు. అందుకు కారణం ఆయన పలు సందర్భాల్లో ఎంతో మానవత్వంగా ఉంటారంట. తనతో కలిసి పని చేసి వారి ఆరోగ్యం పట్ల, ఇతర సమస్యలను కూడా తనకు వీలైనంతగా పరిష్కరించేలా బాధ్యతాయుతంగా ఉంటారంట. ఇదే సమయంలో అక్షయ్ కుమార్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. బాలీవుడ్ లో పని చేస్తున్న స్టంట్ మెన్స్ అందరి ఆరోగ్యం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.

బాలీవుడ్ లో స్టంట్ మెన్స్ గా పని చేస్తున్న 650 మంది ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఏడాది కోట్లల్లో ఖర్చు చేస్తున్నారంట అక్షయ్ కుమార్. ప్రతి ఏడాది అక్షయ్ కుమార్ వారందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు చేస్తున్నారంట. ఇందుకు గాను ప్రతి ఏడాది రూ.1.25 కోట్లు విరాళంగా ఇస్తున్నారంట. ఇలా స్టంట్స్ మెన్ గా పని చేస్తున్న అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం పట్ల ప్రశంసలు అందుకుంటున్నారు అక్షయ్ కుమార్. సెట్స్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది.

ఇక చాలా మందికి హెల్త్ ఇన్సురెన్స్ లపై సరైన అవగాహన ఉండదు. ఈ క్రమంలో స్టంట్స్ మెన్ లు ఎప్పుడూ ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి తానే స్వయంగా ప్రతి ఏడాది ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ తీసుకుంటున్నారంట. ఇక అక్షయ్ కుమార్ చివరిగా తెలుగులో కన్నప్ప చిత్రంలో శివుడి పాత్రతో వెండితెరపై అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాలీ ఎల్ఎల్‌బీ 3 చిత్రంతో సెప్టెంబర్ 19 నుంచి ప్రేక్షకులను అలరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X