కరోనా బారిన పడిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్
కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. అంతా అయిపోయింది. వ్యాక్సిన్ కూడా వచ్చేసిందని అనుకుంటున్న సమయంలో సడన్ గా సెకండ్ డోస్ ఇచ్చినట్లు కరోనా వీరవిహారం చేస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది కరోనా భారిన పడుతున్నారు. మరణాల సంఖ్య కూడా మళ్ళీ పెరుగుతోంది. ఇక సినిమా ప్రపంచంలో షూటింగ్ లతో బిజీగా ఉండే స్టార్స్ కూడా కరోనా బారిన పడుతున్నారు.
ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే సీనియర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ రోజు ఉదయం కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రోటోకాల్స్ ను ఫాలో అవుతున్నాను. వెంటనే నాకు నేనే హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళాను. అలాగే మెడికల్ హెల్ప్ కూడా తీసుకుంటున్నాను అని అక్షయ్ కుమార్ తెలిపారు.

అదే విధంగా నాతో ఇటీవల టచ్ లో ఉన్న వారందరు కూడా వెంటనే టెస్ట్ చేయించుకోవాలని చెప్పిన అక్షయ్ కుమార్ అందరూ జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ యాక్షన్ లోకి వస్తానని చెప్పాడు. ఇక ప్రస్తుతం అక్షయ్ చేతిలో 6 సినిమాలున్నాయి. అందులో బెల్ బాటమ్ అలాగే మరొక సినిమా విడుదలకు రెడీగా ఉంది. మరో రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











