అర్జున్ రాంపాల్‌కు ఎదురుదెబ్బ.. డ్రగ్స్ కేసులో షాకిచ్చిన ఎన్సీబీ అధికారులు
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో విచారణకు అవుతున్న సమయంలో అతడి స్నేహితుడిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఇప్పటికే తన ప్రేయసి సోదరుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళ్లితే..

ప్రియురాలిని 12 గంటలపాటు
కొద్ది రోజుల క్రితం ఎన్సీబీ అధికారులు అర్జున్ రాంపాల్ ప్రేయసి గ్యాబ్రిల్లా డెమెట్రియాడెస్ సోదరుడు ఎజిసిలాస్ డెమోట్రియాడెస్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవంబర్ 9వ తేదీన అర్జున్ రాంపాల్ నివాసంలో సోదాలు నిర్వహించారు. తన ప్రేయసి గ్యాబ్రిల్లాకు సమన్లు జారీ చేసి బుధవారం 12 గంటలపాటు విచారించారు.

విచారణకు ముందు షాక్
ఇక డ్రగ్స్ సోదాల భారీగా నిషేధిత మాదక ద్రవ్యాలు లభించడంతో అర్జున్ రాంపాల్‌కు కూడా సమన్లు జారీ చేశారు. శుక్రవారం అంటే నవంబర్ 13వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్ల పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య శుక్రవారం ఉదయమే మరో షాక్ ఇచ్చారు.

అర్జున్ రాంపాల్ స్నేహితుడి అరెస్ట్
అర్జున్ రాంపాల్ డ్రగ్ కేసులో విచారణకు హాజరుకానున్న సమయంలో తన స్నేహితుడు పాల్ బార్టెల్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలో నివాసం ఉంటున్న పాల్ ఇంటిలో భారీగా డ్రగ్స్ లభించడంతోపాటు కొన్ని లింకులు కూడా అధికారుల దృష్టికి రావడంతో అధికారులు అదుపులోకి తీసుకొన్ని ప్రశ్నిస్తున్నారు.

ఎన్సీబీ కార్యాలయానికి అర్జున్ రాంపాల్
ఇప్పటికే ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి చేరుకొన్న అర్జున్ రాంపాల్ పలు కోణాల్లో విచారించే అవకాశం ఉంది. అలాగే తన ఇంటిలో సోదాల సమయంలో స్వాధీనం చేసుకొన్న ఎలక్ట్రానిక్ వస్తువులో బయటపడిన సమాచారం ఆధారంగా ప్రశ్నించే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











