బాలీవుడ్ హీరోయిన్ పాయల్ అరెస్ట్.. అలాంటి వివాదంతో కటకటాలపాలు..

సోషల్ మీడియాలో సోసైటీ చైర్మన్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, దూషణలకు పాల్పడిన కేసులో బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీ కటకటాలపాలైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. స్తానికంగా ఈ వివాదం చర్చనీయాంశమైంది. పాయల్ ఇలాంటి వివాదాల్లో తలదూర్చడం మొదటిసారి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ వివాదంలోకి వెళితే...

సోసైటీ సభ్యులతో గొడవ

సోసైటీ సభ్యులతో గొడవ

ఓ సొసైటీలోని ఓ ప్లాట్ విషయంలో గొడవ జరిగిదంది. ఆ సమయంలో అందరి కాళ్లు విరగ్గకొడుతానని బెదిరించింది. ఆటస్థలానికి సంబంధించిన గొడవ కారణంగా సొసైటీ సభ్యులను బెదిరించింది. వారిపై తప్పుడు కేసులు పెడుతానని బెదిరించింది అంటూ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేశారు.

 కొందరు ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు..

కొందరు ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు..

అంతేకాకుండా గురువారం తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ... నన్ను కొందరు ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని పాయల్ అన్నారు. కొందరు చెడ్డ పనులు చేయించడానికి నన్న ముగ్గులోకి దించాలని చూశారు. వాళ్లు అలా చేస్తున్నారని తెలిసి కూడా నేను వారి ట్రాప్‌లో పడిపోయాను. కానీ అందంతా దేవుడి ప్లాన్ అనుకొన్నాను. అందులో ఎవరూ కూడా నాతో టచ్‌లో లేరు. ఓ నమశివాయ: అంటూ పోస్టులో పేర్కొన్నారు.

 పాయల్‌పై ఫిర్యాదు.. స్పందించిన పోలీసులు

పాయల్‌పై ఫిర్యాదు.. స్పందించిన పోలీసులు

ఆ తర్వాత ఆ పోస్టును పాయల్ రోహత్గీ డిలీట్ చేశారు. అయితే నర్మగర్భంగా చేసిన పోస్టుపై కొందరు ఆహ్మాదాబాద్ శాటిలైట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ చైర్మన్ డాక్టర్ పరాగ్ షా ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుెకొని ఆమెను అరెస్ట్ చేశారు. తన ఫిర్యాదులో చైర్మన్.. సొసైటీ సభ్యులతో గొడవపడి.. తనను చంపుతానని బెదిరించారు అని పేర్కొన్నారు.

అనేక వివాదాలతో పాయల్

అనేక వివాదాలతో పాయల్

పాయల్‌ రోహత్గీని అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం పంపించారు. ఆమెకు కరోనా సంబంధింత వైద్య పరీక్షలతోపాటు అన్ని రకాల పరీక్షలు చేయించి అదుపులోకి తీసుకొన్నాడు. గతంలో కూడా 2019లో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అరెస్ట్ అయ్యారు. అలాగే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నెపొటిజం ఉందంటూ బాలీవుడ్ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 పాయల్ రోహత్గీ సినీ కెరీర్ ఇలా...

పాయల్ రోహత్గీ సినీ కెరీర్ ఇలా...

పాయల్ రోహత్గీ కెరీర్ విషయానికి వస్తే.. 36 చైనా టౌన్, ధోల్, అగ్లీ ఔర్ పగ్లీ, దిల్ కబడ్డీ చిత్రాల్లో నటించారు. అలాగే బిగ్‌బాస్ 2, నాచ్ బలియే 7లో పాల్గొన్నారు. 2011లో రెజ్లర్ సంగ్రామ్ సింగ్‌తో రిలేషన్‌లో ఉందనే కారణంతో మీడియాలో హైలెట్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X