For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shilpa Shetty పీకల్లోతు కష్టాల్లో.. లక్నో పోలీసులు నోటీసులు.. అరెస్ట్ తప్పదా?

  |

  బాలీవుడ్ సీనియర్ నటీమణి మరొక కొత్త సమస్యలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. అసలే ఆమె భర్త రాజ్ కుంద్రా ఇటీవల బలవంతంగా పోర్న్ సినిమాలను షూట్ చేసిన కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. అలాగే పలు లైంగిక ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే భర్త కారణంగా క్రైమ్ బ్రాంచ్ పోలిసులు శిల్పా శెట్టిని కూడా గట్టిగానే విచారించారు. ఇక ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని వెల్‌నెస్ సెంటర్‌పై కొత్త కేసు నమోదైనందున శిల్పా శెట్టికి మరికొన్ని సమస్యలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో అప్పటికే నటికి నోటీసు అందజేయబడింది.

  టాప్ తీసేసి షాకిచ్చిన పూనమ్ బజ్వా: అందాల ఆరబోతలో గేట్లు ఎత్తేస్తూ.. ఓ రేంజ్‌లో చూపించిన హీరోయిన్

  శిల్పా శెట్టికి నోటీసులు

  శిల్పా శెట్టికి నోటీసులు

  లక్నో పోలీస్ కమిషనర్ డికె ఠాకూర్ కూడా ఈ కేసుపై ఒక వివరణ అయితే ఇచ్చారు. ఫ్రాంఛైజీ ఒప్పందంలో మోసం చేసినందుకు లక్నో నుండి ఒక వ్యక్తి ద్వారా IOSIS వెల్నెస్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు డైరెక్టర్‌పై చీటింగ్ కేసు నమోదైనట్లు తెలుపుతూ ఇక శిల్పా శెట్టి కంపెనీ ఛైర్‌పర్సన్ అని కనుగొనబడిందని అన్నారు.

  కావున మేము వారికి నోటీసులు ఆందజేసినట్లు తెలియజేశారు. అయితే శిల్పా శెట్టి నివాసంలో వ్యక్తిగతంగా అందజేయబడిందని కేసు విషయంలో ఉన్న పూర్తి విషయంలో కూడా ఆమె కథను వివరించమని అన్నారు.

  వారికి ఎలాంటి సంబంధం లేదు

  వారికి ఎలాంటి సంబంధం లేదు

  ఈలోగా, నటి వ్యాపార భాగస్వామి కిరణ్, శిల్పా శెట్టి మరియు ఆమె తల్లి సునంద శెట్టి ఇకపై తన వెల్‌నెస్ స్పాతో సంబంధం కలిగి లేరని అలాగే ఆమె కంపెనీ ఛైర్‌పర్సన్‌గా ఉంటారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా పోస్ట్‌లో కిరణ్ ఈ విధంగా ఒక వివరణ అయితే ఇచ్చారు. నేను ఈ పోస్ట్‌ని బాధ్యతాయుతమైన వ్యక్తిగా ప్రసంగిస్తున్నాను, IOSIS స్పా & వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నాను.

  అందువల్ల సోషల్ మీడియాలో లేదా ఇతర నిడియాలలో ఒక విషయం గురించి పోస్ట్ చేయడానికి ముందు దయచేసి నిజాలను తెలుసుకోండి. అలాగే నిర్ధారించుకోండి. శ్రీమతి శిల్పా శెట్టికి అలాగే ఆమె తల్లి శ్రీమతి సునంద శెట్టికి IOSIS తో ఎలాంటి సంబంధం లేదు. మేము చాలా కాలం క్రితం స్నేహపూర్వకంగా విడిపోయాము అని తెలియజేశారు.

  పీకల్లోతు కష్టాల్లో

  పీకల్లోతు కష్టాల్లో

  ఇప్పటికే తన భర్త రాజ్ కుంద్రాకు అశ్లీల చిత్రాల కేసు విషయంలో జులై 18 న అరెస్ట్ చేయడంతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న శిల్పా శెట్టికి ఇప్పుడు మరొక సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. ఇక రాజ్ కుంద్రా చాలా రోజుకుగా తన బెయిల్ దరఖాస్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

  అతనికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని మరియు అతని బెయిల్ దరఖాస్తును పోలీసులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఒకవేళ అతడిని బెయిల్‌పై విడుదల చేస్తే అతను మళ్లీ అలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాడని సాక్ష్యాధారాలను కూడా తారుమారు చేసే అవకాశం ఉన్నట్లు కూడా కోర్టులో వివరణ ఇచ్చారు. అతను బ్రిటిష్ పౌరుడు కాబట్టి, అతను దేశం నుండి తప్పించుకోగలడని కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు.మరి ఈ కేసు విషయం నుంచి రాజ్ కుంద్రా మరియు శిల్పా శెట్టి ఎలా తప్పించుకుంటారో చూడాలి.

  Allu Arjun Biography | Why Allu Arjun Is Biggest PAN India Star ? | Filmibeat Telugu
  అసభ్యకరమైన సినిమాలను

  అసభ్యకరమైన సినిమాలను

  ఇటీవల బాంబే హైకోర్టు మరోసారి రాజ్ కుంద్రాకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. పోర్న్ ఫిలిమ్ కేసులో శిల్పాశెట్టి భర్త గత కొంతకాలంగా పోలీసుల కస్టడీలో ఉన్నాడు. వీలైనంత వరకు అతనికి బెయిల్ రావద్దని అధికారులు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. అసభ్యకరమైన సినిమాలను కొన్ని ఆప్స్ ద్వారా ప్రసారం చేసి వాటిని బిజినెస్ చేసుకుంటున్నట్లు అనేక రకాల కేసులు నమోదయ్యాయి.

  ఇక వాటిపై సీరియస్ గా విచారణ జరుగుతోంది. అయితే విచారణ లో రాజ్ కుంద్రా ఏమాత్రం సహకరించడం లేదని ఇదివరకే చాలాసార్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టులో వివరణ ఇవ్వడం మరింత వైరల్ గా మారింది.

  English summary
  Bollywood actress Shilpa Shetty served notice by wellness centre case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X