twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రీ ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజులకే.. అనారోగ్యంతో సీనియర్ నటి కన్నుమూత

    |

    బాలీవుడ్ సీనియర్ నటి విద్యా సిన్హా కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. గురువారం మధ్యాహ్నం ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. 71 ఏళ్ల విద్యా సిన్హా బాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో నటించారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత ఆమె బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొత్తంగా ఆమె 25 సినిమాలు, 10 టీవీ షోలలో పాల్గొన్నారు. విద్యా మృతి బాలీవుడ్‌లో విషాదం అలముకుంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    1947 నవంబర్ 15న జన్మించిన విద్యా సిన్మా 18 ఏళ్ల వయసు నుంచే మోడలింగ్‌పై మక్కువ కనబరిచారు. దానినే వృత్తిగా ఎంచుకుని కొంత కాలం పలు యాడ్స్ చేశారు. ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయారు. వివాహం తర్వాత మరోసారి తెరపైకి వచ్చిన ఆమె 1974లో 'రజినీగంధ' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'చోటీసీ బాత్‌', 'పతి పత్ని ఔర్‌వో', 'జీవన్ ముక్త్', 'ఖర్మ్', 'కితాబ్' సహా ఎన్నో చిత్రాల్లో అత్యుత్తమ నటనను కనబరిచి మన్ననలు పొందారు.

    Bollywood Actress Vidya Sinha Died

    ఇక, 1986లో 'జీవా' సినిమా తర్వాత ఆమె నట జీవితానికి స్వస్తి పలికారు. ఆ తర్వాత 2011లో సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన 'బాడీగార్డ్'తో రీ ఎంట్రీ ఇచ్చినా మరో సినిమా చేయలేదు. కానీ, 'కుల్ఫీ కుమార్‌ బజేవాలా', 'కుబూల్‌ హై', 'కావ్యాంజలి', 'భాబీ', 'హర్ జీత్', 'జిందగీ విన్స్' సహా పలు టీవీ షోలలో పాల్గొన్నారు. కొద్దిరోజుల క్రితం హృదయ, ఊపిరితిత్తుల వ్యాధి రావడంతో సదరు షోల నుంచి తప్పుకున్నారు.

    ఆ సమయంలో చాలా కాలం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఆరోగ్యం కుదటపడడంతో ఆమె మరోసారి ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఇంతలోనే అనారోగ్యంతో ఆమె మరణించారు. ఆమె మృతిని సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుందని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Film and television actress Vidya Sinha, who was known for her roles in films like Pati Patni Aur Woh and Chhoti Si Baat, died on Thursday at the age of 71. The actress was admitted to Criticare Hospital in Mumbai, after she had complained of breathlessness.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X