బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్‌లో ముగ్గురు సూపర్‌స్టార్లు.. Aఅనే అక్షరం హీరో పేరు వైరల్..ఆ ముగ్గురు ఎవరంటే?

బాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు హీరోలకే పరిమితమైన డ్రగ్స్ కేసు విచారణ త్వరలోనే హీరోలకు చుట్టుకోబోతున్నది. జాతీయ టెలివిజన్ ఛానెల్ బ్రేకింగ్ వార్త ప్రకారం ముగ్గురు సూపర్‌స్టార్ల పేర్లు వెలుగులోకి వచ్చాయనే విషయం సంచలనంగా మారింది. ప్రస్తుతం ముగ్గురు స్టార్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆ ముగ్గురు సూపర్‌స్టార్లు ఎవరు అనేది ఇప్పుడు మీడియాలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది. ఆ ముగ్గురు ఎవరంటే..

టాప్ హీరోయిన్లను ప్రశ్నించిన ఎన్సీబీ

టాప్ హీరోయిన్లను ప్రశ్నించిన ఎన్సీబీ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో భాగంగా దర్యాప్తు చేపట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు బాలీవుడ్‌లో డ్రగ్స్ కోణం బయటపడింది. పలువురు డ్రగ్స్ సప్లయిదార్లతోపాటు రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన తర్వాత దీపిక పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్‌కు సమన్లు జారీ చేసి విచారించారు.

100కుపైగా సినీ తారల పేర్లు

100కుపైగా సినీ తారల పేర్లు

బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో దాదాపు 100కుపైగా సినీ తారల పేర్లను డ్రగ్స్ సప్లయిర్లు వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. అయితే వారి గురించి ఆరా తీస్తున్నట్టు ఎన్సీబీ వర్గాలు వెల్లడించినట్టు తెలుస్తున్నది. అయితే బాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్న వారిలో ముగ్గురు బాలీవుడ్ సూపర్‌స్టార్ల పేర్లు వెలుగులోకి వచ్చాయనేది తాజా సమాచారం.

ముగ్గురు సూపర్ స్టార్ల పేర్లు బయటకు

ముగ్గురు సూపర్ స్టార్ల పేర్లు బయటకు

డ్రగ్స్ సప్లయర్లను, ఇతర హీరోయిన్లను ప్రశ్నించిన సమయంలో ముగ్గురు స్టార్ హీరోల పేర్లు అధికారులు దృష్టికి వచ్చాయని తెలిసింది. అందులో ఒక స్టార్ హీరో పేరు A అక్షరంతో మొదలవుతుందనే విషయాన్ని నర్బగర్భంగా తెలిపారు. అయితే ముగ్గురు పేర్లను మాత్రం బయటకు వెళ్లడించకపోవడంతో ఆ ముగ్గురు వాళ్లే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ముగ్గురు వీరే అంటూ

ఆ ముగ్గురు వీరే అంటూ

జాతీయ టెలివిజన్ ఛానెల్ బ్రేకింగ్ న్యూస్ ప్రకటించిన తర్వాత Super Star అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. S, R, A అనే అక్షరాలు ఉన్న హీరోల పేర్లు అంటూ సోషల్ మీడియాలో పొస్టులు ప్రచారమయ్యాయి. ఆ సందర్భంగా రకరకాల మీమ్స్, కామెంట్స్‌తో ఈ వార్త వైరల్ అయింది. అయితే ఈ ముగ్గురికి త్వరలోనే సమన్లు జారీ చేసే అవకాశం ఉందనే వార్త బాలీవు్ మీడియాలో ప్రముఖంగా మారింది. ఆ ముగ్గురు ఎవరనేది ఎన్సీబీ సమన్లు జారీ చేస్తే తప్ప బయటకు తెలిసే అవకాశం లేదు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
కరణ్ జోహర్ పార్టీపై ఎన్సీబీ నజర్

కరణ్ జోహర్ పార్టీపై ఎన్సీబీ నజర్

ఇక బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ 2019లో తన నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పార్టీలో స్టార్ హీరోలు కొందరు మద్యం మత్తులో ఉన్నట్టు స్పష్టమైంది. ప్రస్తుతం ఆ పార్టీ వీడియోపై ఎన్సీబీ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టినట్టు సమాచారం. ఆ పార్టీ వీడియో ఆధారంగా సమన్లు జారీ చేస్తారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఆ పార్టీలో దీపిక పదుకోన్‌కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X