అమ్మాయితో బెడ్‌పై హీరో తండ్రి.. ఆ డైరెక్టర్‌ని దారుణంగా కొట్టిన సూపర్‌స్టార్

సినీరంగంలో విచిత్రమైన పరిస్ధితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. నటీనటులకు కథ చెప్పే సమయంలో కనిపించే స్క్రిప్ట్‌కి, సెట్స్ మీద తీసే సన్నివేశాలకు ఏమాత్రం తేడా ఉండదు. అలాగే తీసిన సీన్స్‌ను ఎడిటింగ్‌లో లేపేసిన సందర్భాలు, పూర్తిగా మార్చేసిన ఘటనలు ఉన్నాయి. కొందరు నటీనటులు.. దర్శక నిర్మాతలను ఏమీ అనలేక మౌనం వహిస్తే, మరికొందరు మాత్రం సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడంతో పాటు చేయి చేసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. తాజాగా తన తండ్రిని అభ్యంతరకరంగా చూపించిన దర్శకుడిని ఓ హీరో చితకబాదాడు. ఈ వివరాల్లోకి వెళితే..

తండ్రి అడుగుజాడల్లో హీరోగా
బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్ర నటవారసుడిగా వెండితెరపై అడుగుపెట్టారు సన్నీ డియోల్. 1983లో రాహుల్ రావైల్ దర్శకత్వంలో తన తండ్రి నటించిన బేతాబ్ చిత్రంలో తొలిసారిగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో సన్నీ వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు. సోహ్ని మహివాల్, అర్జున్, పాప్‌కి దునియా, త్రిదేవ్, చల్‌భాజ్‌లు హిట్ కావడంతో సన్నీ డియోల్ పేరు మారుమోగింది. ఆ తర్వాత ఘయాల్ చిత్రంతో తొలిసారిగా హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సినిమాలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలతో పాటు తొలి సినిమాకే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్, నేషనల్ ఫిల్మ్ జ్యూరీ స్పెషల్ అవార్డ్ అందుకున్నారు.

Bollywood Hero Sunny Deol beats director for degrading Dharmendra

మాస్ హీరోగా క్రేజ్
అనంతరం దామిని, డర్, జీత్, ఘాతక్, డిల్లగి, గదర్ ఏక్ ప్రేమ్ కథ, ఇండియన్, అప్నే తదితర చిత్రాలతో సక్సెస్‌లు కొట్టిన మాస్ హీరోగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సన్నీడియోల్. ఖాన్ త్రయం, యంగ్ హీరోల రాకతో ఆయన క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయారు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమాలను పక్కనపెట్టారు. ఈ దశలో గదర్ 2 చిత్రం పాత సన్నీడియోల్‌ను గుర్తుచేసింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 700 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించారు సన్నీ. ఆ తర్వాత జాట్ మూవీతో మరోసారి యాక్షన్ సీన్స్‌లో తనకు తిరుగులేదని నిరూపించారు. ప్రస్తుతం లాహోర్ 1947, బోర్డర్ 2, రామాయణ పార్ట్ 1, సఫర్ చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు.

తండ్రి అంటే పంచ ప్రాణాలు
ఇకపోతే.. తన తండ్రి ధర్మేంద్ర అంటే సన్నీడియోల్‌కు ఎంతో గౌరవం, ప్రేమ. ఆయనను ఎవరైనా పల్లెత్తు మాట అంటే ఊరుకునేవారు కాదు. బాలీవుడ్‌లో యంగ్రీ యంగ్‌మెన్‌గా, హీ మెన్‌గా అభిమానులు పిలుచుకునే ధర్మంద్ర వయసు, కొత్త కుర్రాళ్ల రాకతో తన స్టార్‌డమ్‌ను కోల్పోయారు. దాంతో చిన్న సినిమాలలో నటిస్తూ వచ్చారు ధర్మేంద్ర. ఈ క్రమంలో కాంతి షా అనే దర్శక నిర్మాత ఓ సినిమాలో ధర్మేంద్రకు గుండెపోటు వచ్చినట్లుగా నటించాలని ఓ సీన్ చెప్పారు. దానికి తగినట్లుగానే ధర్మేంద్ర నటించారు. అయితే దానిని ఎడిటింగ్‌లో బెడ్‌రూమ్ సీన్‌లో నటించినట్లుగా అసభ్యకరంగా రీ ఎడిట్ చేశాడు.

కథ గురించి డిస్కస్ చేయాలని
తొలుత ఈ సినిమాను పంజాబ్‌లో విడుదల చేయగా.. బాలీవుడ్ సూపర్‌స్టార్‌లలో ఒకడిగా, భారతీయ చిత్ర పరిశ్రమలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మేంద్ర ఆ వయసులో ఓ అమ్మాయితో బెడ్ రూమ్ సీన్స్‌లో కనిపించడంతో అభిమానుల్ని మనస్తాపానికి గురిచేసింది. అప్పటి వార్తాపత్రికల్లోనూ ఈ వ్యవహారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దీంతో ధర్మేంద్ర కుమారుడు సన్నీడియోల్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ సినిమా స్క్రిప్ట్ గురించి మాట్లాడాలని ఆఫీస్‌కు రప్పించి చితకబాదాడట. ఈ విషయం గురించి బాలీవుడ్‌లో ఇప్పటికీ కథకథలుగా చెప్పుకుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X