For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒకప్పుడు 100కోట్లు అందుకున్న కంగనా రనౌత్.. ఇప్పుడు మాత్రం దారుణంగా..

  |

  కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తలైవి, సెప్టెంబర్ 10, థియేటర్‌లకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ పరంగా సినీ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన పొందింది. కొందరు సినిమాను ప్రశంసించగా, మరికొందరు దాన్ని పెద్దగా పట్టించిలుకోలేదని వచ్చిన వసూళ్లను చూస్తేనే అర్ధమవుతోంది. కొనసాగుతున్న కోవిడ్ 19 మహమ్మారి మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రారంభ రోజున అంటే శుక్రవారం నాడు 1.25 కోట్ల రూపాయలను రాబట్టింది. తాజా నివేదికల ప్రకారం తలైవి బాక్స్ ఆఫీస్ వద్ద రెండవ రోజు కొంత ఎక్కువ వసూళ్లను సాధించింది. కానీ పెట్టిన పెట్టుబడికి ఆ లెక్కలు ఏ మాత్రం సరితూగవు. కంగనా నటనపై పాజిటివ్ టాక్ రావడంతో రెండవ రోజు నుంచి కాస్త కలెక్షన్స్ పెరుగుతున్నాయి.

  తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక బాహుబలి రచయిత కె.విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు రచయితగా వర్క్ చేశారు. ఎలాగైనా ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీసు వద్ద తన మార్కెట్ ను సెట్ చేసుకోవాలని కంగనా రనౌత్ గట్టిగానే ప్రయత్నం చేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో అయితే వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని బాలీవుడ్ లోనే కాకుండా తమిళం తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేశారు. కంగనా ఈ సినిమా ప్రమోషన్ కూడా బాగానే చేసుకుంటూ వచ్చింది. ఇక ఈ బాలీవుడ్ క్వీన్ బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ అయితే అనుకున్నంతగా అందుకోలేకపోయింది.

  Bollywood Kangana Ranaut thalaivi shocking collections,

  గతంలో కంగనా ఏలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకునేవి. చిన్న చిన్న సినిమాలు కూడా మొదటి రెండు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడినీ సగం వరకు వెనక్కి తెచ్చేవి. కానీ ఈసారి మాత్రం ఆమె అంచనాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంటే ఇండియాలో అందరికీ తెలిసిన ఒక పవర్ఫుల్ ఉమెన్. అలాంటి మహిళ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కంగనా రనౌత్ నటించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా అయితే విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ బాక్సాఫీసు వద్ద ప్రేక్షకుల సంఖ్య మాత్రం పెంచుకోలేక పోయింది. ఒకప్పుడు ఏకంగా వంద కోట్లు వసూళ్లను అందుకున్న కంగనా ఈసారి మాత్రం ఊహించని అనుభవాన్ని ఎదుర్కొంది.

  చివరగా మణికర్ణిక కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా తెలుగు తమిళ్ లో రిలీజ్ అయ్యింది. అసలైతే తలైవిని ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు కరోనా పరిస్థితుల వలన సినిమాలో రెండు సార్లు వాయిదా వేసుకోవలసి వచ్చింది. ఇప్పుడు చాలా ఏరియాల్లో పూర్తిస్థాయిలో థియేటర్స్ ఓపెన్ చేయలేదు. అయినప్పటికీ పట్టుదలతో ప్రేక్షకుల ముందుకు వెళ్ళింది. తప్పకుండా సినిమా మంచి ఓపెనింగ్స్ కూడా అందుకు తగ్గట్టుగా ఉంటాయని అందరూ అనుకున్నారు. మరో వైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిస్థితిలో చక్కబడిన ప్రతిసారి కూడా మంచి సినిమాలకు బాక్సాఫీస్ కలెక్షన్స్ గట్టిగానే వస్తున్నాయి. సిటీ మార్ సినిమా మొదటి రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ కలెక్షన్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది. ఇక తలైవి సినిమాకు ఆ ప్రభావం కూడా కాస్త పడిందనే చెప్పాలి.

  English summary
  Bollywood Kangana Ranaut thalaivi shocking collections,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X