twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత.. విషాదంలో సినీ ఇండస్ట్రీ

    |

    బాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మొహమ్మద్ జహుర్ ఖయ్యాం హష్మి కన్నుమూశారు. 93 ఏళ్ల ఆయన కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అప్పటి నుంచి ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గత నెల ఆయన పరిస్థితి విషమించింది. అప్పటి నుంచి ఖయ్యాంను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

    ఈ మధ్య కొంచెం కోలుకున్నట్లు తెలిసింది. అయితే, సోమవారం రాత్రి ఆయనకు విపరీతమైన చాతి నొప్పి వచ్చిందని సమాచారం. ఆ తర్వాత కొద్దిసేపటికే గుండె ఆగిపోవడంతో ఖయ్యాం తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. దిగ్గజ కళాకారుడి మృతితో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

    Bollywood music director Khayyam died

    ఖయ్యాం తన 17వ ఏటనే తన సంగీత ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత చాలా సినిమాలకు సంగీతం అందించారు. అయితే, 'ఉమ్రావ్‌ జాన్‌' సినిమా ఆయన జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమాలో అందించిన సంగీతానికి అందరూ ఫిదా అయిపోయారు. అంతేకాదు, ఈ చిత్రానికి గానూ ఖయ్యాంకు జాతీయ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది.

    దీనితో పాటు 'కభీకభీ' చిత్రం కూడా ఆయన మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ సినిమా కూడా ఫిలింఫేర్ అవార్డు దక్కింది. వీటిలో పాటు ఎన్నో అవార్డులు ఆయన సొంతం అయ్యాయి. ఖయ్యాం చేసిన సేవలకు గానూ 2007లో సంగీత నాటక అకాడమి అవార్డుతో పాటు 2011లో ప్రతిష్టాత్మ పద్మభూషణ్‌ అవార్డు ఆయనను వరించాయి. ఖయ్యాం మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గాయని లతా మంగేష్కర్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    English summary
    Indian music director Mohammed Zahur Khayyam Hashmi, popularly known as Khayyam, died in a Mumbai hospital on Monday, reports news agency PTI. He died at the age of 93.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X