For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రియాపై మీడియా దాడి సిగ్గు చేటు.. రాబందులలా ఎందుకు ప్రవరిస్తున్నారో: బాలీవుడ్ స్టార్స్ ఆగ్రహం

  |

  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసి రియా చక్రవర్తి విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. ఇటీవల రియా ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) కార్యాలయానికి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా మీడియా ఆమెపై దాడి చేసిసినట్లుగా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి.

  SSR case: Rhea Chakraborty reaches NCB office for questioning | Oneindia Telugu
   ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారు..

  ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారు..

  తాప్సీ పన్నూ, స్వరా భాస్కర్, ప్రముఖ నిర్మాత అనుభవ్ సిన్హాతో వంటి సెలెబ్రెటీలు మీడియా తీరును ఖండించారు. మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు కూడా రియా చక్రవర్తిని మోబింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కోవిడ్-19 మహమ్మారి మధ్య అన్ని ప్రామాణిక ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారని తగిన చర్యలు కూడా తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

  వీడియో వైరల్..

  వీడియో వైరల్..

  రియా ఆదివారం ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) కార్యాలయానికి చేరుకున్న తర్వాత మీడియా వ్యవహరించిన విధానం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సుశాంత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో విచారణ కోసం రియా చక్రవర్తి ఎన్‌సిబి ముందు హాజరయిన విషయం తెలిసిందే.

  తాప్సి పన్ను అసహనం..

  తాప్సి పన్ను అసహనం..

  సోషల్ మీడియాలో షేర్ చేసిన విజువల్స్ లలో రియాను ముంబై పోలీసులు ఎస్కార్ట్ చేసి మరి ఎన్‌సిబి కార్యాలయానికి తరలించేటప్పుడు జర్నలిస్టులు నెట్టివేసినట్లు అర్ధమవుతోంది.

  మీడియా ప్రవర్తనను తాప్సి కూడా విమర్శించారు, "న్యాయం పేరిట దోషిగా నిరూపించబడక ముందే ఒక మనిషి జీవించే హక్కును కోల్పోతున్నాడు. కర్మలు ప్రతి మానవుడి చిరునామాను కనుగొంటాయి. ఇదే దానికి ఒక సాక్ష్యం.'

  సిగ్గుపడాల్సిన విషయం.

  సిగ్గుపడాల్సిన విషయం.

  దీన్ని అపాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. చాలా దారుణంగా ఉందని స్వరా భాస్కర్ అన్నారు. రియా చక్రవర్తి ఎన్‌సిబి కార్యాలయంలోకి ప్రవేశించిన వీడియో చూస్తుంటే "ముంబైలో శాంతిభద్రతలపై మీడియా శక్తి ఎక్కువైంది. దీనికి ఏమైనా పేర్లు ఉన్నాయా. ఏ పేరు పెట్టి పిలిచినా ఘోరమే" అని అనుభవ్ సిన్హా అన్నారు.

   మీడియా రాబందులలా..

  మీడియా రాబందులలా..

  ఇక మీడియా ప్రవర్తన "ఖండించదగినది" అని డియా మీర్జా కూడా తన వివరణ ఇచ్చారు. రియాకు ఎందుకు స్పేస్ ఇవ్వడం లేదు. శారీరక దూరం చేసే హక్కు ఇవ్వలేరా? మీడియా ఎందుకు రాబందులలా ప్రవర్తిస్తోంది? దయచేసి ఆమెకు స్పేస్ ఇవ్వండి. దయచేసి దాడి చేయడాన్ని ఆపండి. ఆమెను & ఆమె కుటుంబాన్ని అమానుషంగా చూపడం ఆపండి అంటూ డియా ట్విట్టర్ లో పేర్కొన్నారు.

  దేశం మొత్తం దృష్టి రియా చక్రవర్తిపైనే..

  దేశం మొత్తం దృష్టి రియా చక్రవర్తిపైనే..

  సినిమా నిర్మాత అలంకృత శ్రీవాస్తవ మాట్లాడుతూ దేశం మొత్తం దృష్టి రియా చక్రవర్తిపైనే ఉందని అన్నారు. "ఆర్థిక వ్యవస్థ గురించి, మహమ్మారి లేదా ఇతర సమస్యల గురించి ఆలోచనలు లేవు. భారతీయులు రియాను పణంగా పెట్టడానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. అదే మన ప్రజలను ఎక్కువగా సంతోష పరుస్తోంది. ద్వేషం, విషం సరిపోదు. మేము అనారోగ్యంతో ఉన్నాము. చాలా జబ్బుపడ్డము" అని ఆమె ట్వీట్ చేశారు.

  English summary
  Bollywood actors including actors Taapsee Pannu, Swara Bhasker, and filmmaker Anubhav Sinha, have criticised mediapersons mobbing actor Rhea Chakraborty,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X