twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ గేయ రచయిత మ‌ృతి

    |

    ప్రముఖ నటులు రిషికపూర్, ఇర్ఫాన్ ఖాన్, సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ మరణం నుంచి తేరుకోక ముందే బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకొన్నది. ప్రముఖ గేయ రచయిత అన్వర్ సాగర్ తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మరణానికి కారణాలను వైద్యులు వెల్లడించలేదు.

    బుధవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు లోనైన అన్వర్‌ను కోకిలాబెన్ ధిరూభాయ్ అంబానీ హాస్పిటల్‌కు తీసుకురాగా, ఆయన మార్గమధ్యంలోనే మరణించారని వైద్యులు ధృవీకరించారు. ఆయన వయసు 70 సంవత్సరాలు.

    Bollywoods veteran lyricist Anwar Sagar no more

    అక్షయ్ కుమార్ నటించిన ఖిలాడీ చిత్రంలో ఆయన రాసిన వాదా రహా సనమ్ అనే పాట అత్యంత ప్రేక్షకాదరణ పొందింది. ఇంకా డేవిడ్ ధావన్ రూపొందించిన యారానా, జాకీ ష్రాప్ నటించిన సప్నే సాజన్ కే, అక్షయ్ కుమార్ నటించిన మై ఖిలాడీ తు అనారీ, అజయ్ దేవగణ్ చిత్రం విజయ్ పథ్ చిత్రాల్లో ఆయన రాసిన పాటలు యువతను ఉర్రూతలూగించాయి.

    అన్వర్ సాగర్ మరణవార్తను ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ లిమిటెడ్ ధృవీకరించింది. వెటరన్ లిరిసిస్ట్, ఐపీఆర్ఎస్ సభ్యుడు అన్వర్ ఇకలేరు. బాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలకు ప్రేక్షకులను మెప్పించిన పాటలు రాశారు. అలాంటి గేయ రచయిత మన మధ్య లేకపోవడం బాధకరం. ఇలాంటి విషాద సమయంలో అన్వర్ కుటుంబానికి మనోధైర్యాన్ని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం అని ట్విట్టర్‌లో తెలిపారు.

    English summary
    Bollywood's veteran lyricist Anwar Sagar no more. Indian Performing Arts Society tweets that, Veteran lyricist and IPRS member Anwar Sagar has passed away. Known for writing songs like 'Vaadaa Raha Sanam', he also penned lyrics for iconic movies like #Vijaypath & #Yaraana. Our thoughts & prayers are with his family in this difficult time. May his soul #RIP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X