Ranbir Kapoor Net Worth: రణబీర్ కపూర్ ఆస్తుల నికర విలువ.. ఎన్ని 100 కోట్లో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సౌత్ ఆడియెన్స్ లోనూ మంచి క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. బ్రహ్మాస్త్రం సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారి మరింతగా ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు. ఇక టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో యానిమల్ అనే చిత్రంలో నటించి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన టెర్రిఫిక్ పెర్ఫామెన్స్ తో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు.

ఇక రణబీర్ ప్రస్తుతం బాలీవుడ్ లోని కపూర్ ఫ్యామిలీలో జన్మించారు. 1982 సెప్టెంబర్ 28న జన్మించిన ఆయన తాజాగా 43వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రణబీర్ కపూర్ కు ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు విశేషంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఇంతకీ రణబీర్ కపూర్ ఆయన సినీ కెరీర్ లో ఎన్ని వందల కోట్లు సంపాదించాడు? ఒక్కో సినిమాకు రణబీర్ కపూర్ ఎన్ని కోట్ల పారితోషికం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Bollywood Star Hero Ranbir Kapoor Net worth

తాజాగా నివేదికల ప్రకారం రణబీర్ కపూర్ ఆస్తుల నికర విలువ ఇలా ఉంది. బాలీవుడ్‌లో అత్యంత ప్రసిద్ధ నటులలో ఒకరిగా రణబీర్ కపూర్ ఉన్నారు. 2007 నుంచి చిత్ర పరిశ్రమలో రణబీర్ కపూర్ యాక్టివ్ గా ఉంటున్నారు. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోవడం, ఇక ఆయన నుంచి భారీ చిత్రాలు వస్తుండటంతో ఒక్కో సినిమాకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ట్రేడ్ నిపుణులు తెలుపుతున్న దాని ప్రకారం.. రణబీర్ కపూర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.50 పైగా ఛార్జీ చేస్తున్నారని తెలుస్తోంది.

రణబీర్ కపూర్ ఆస్తుల వివరాల్లోకి వస్తే.. 2025 నాటికి రణబీర్ కపూర్ ఆస్తుల నికర విలువ రూ.350 కోట్లకు చేరుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం ఆయన కెరీర్ లో సంపాదించిన మొత్తంగా చెబుతున్నారు. దీంతో బాలీవుడ్ లో అత్యంత ధనవంతులైన నటులలో ఒకరిగా రణబీర్ కపూర్ చేరిపోయారు. ప్రధానంగా రణబీర్ కపూర్ సినిమాలు, ఎండార్స్‌మెంట్‌లు, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా కోట్లు సంపాదిస్తాడు. అలాగే పెట్టుబడులు కూడా పెడుతున్నారు. ఇటీవల ప్రధాన నిర్మాణ సంస్థ, ఒక VFX కంపెనీలో రూ.15 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇలా ఏడాదికి రూ.30 కోట్ల వరకు సంపాదిస్తాడు.

ఇక ఆయనకు ముంబైలోని పాలి హిల్‌లోని రూ.250 కోట్ల విలువైన కొత్త భవనం ఉంది. ఈ ఇంటి నిర్మాణం, లగ్జరీ, డిజైన్ అప్పట్లో చర్చనీయాంశమైంది. వీటితో పాటు రణబీర్ దగ్గర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. మెర్సిడెస్-AMG SL 55 రోడ్‌స్టర్, బెంట్లీ కాంటినెంటల్ GT, మెర్సిడెస్-మేబాచ్ GLS 600, మెర్సిడెస్-AMG G63, ఆడి R8, రేంజ్ రోవర్, ఖరీదైన లెక్సస్ LM 350h వంటి టాప్ బ్రాండ్ కార్లను కూడా సొంతం చేసుకున్నారు. ఇక రాబోయే చిత్రం Ramayan : Part 1, 2లకు కలిపి రణబీర్ రూ.150 కోట్ల పారితోషికం తీసుకుంటుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X