నాంది రీమేక్ లెక్కలు మామూలుగా లేవుగా.. స్టార్ హీరోతోనే వదులుతున్నారు!
ఇప్పుడు సినిమాలకు భాషా భేదాలు ఉండటం లేదు. కంటెంట్ బాగుంటే ఏ భాష సినిమానైనా మరో భాష వాళ్ళు వెంటనే రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పటికే తెలుగులో తమిళ, మలయాళ భాషలకు చెందిన కొన్ని రీమేక్ సినిమాలు తెరకెక్కుతుండగా మన దగ్గర నుంచి గురించి కూడా కొన్ని సినిమాలను తీసుకెళ్లి బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. అలా ఆ సినిమాల్లో ఒకటిగా నాంది సినిమా నిలిచింది.
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన నాంది సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.. సాధారణంగా కామెడీ సినిమాలకు స్పెషలిస్ట్ అయిన అల్లరి నరేష్ తో అలాంటి పాత్ర చేయించడంతో జనానికి సినిమా మీద అంచనాలు పెరిగాయి. అలా ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఈ రోజు ఉదయమే వెలువడింది. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి స్టార్ హీరో అజయ్ దేవగన్ ఈ సినిమా రీమేక్ చేయబోతున్నట్లుగా దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి అలాగే అజయ్ దేవగన్ ప్రొడక్షన్స్ నుంచి సంయుక్తంగా ప్రకటన కూడా వెలువడింది.

అయితే తెలుగులో అల్లరి నరేష్ తో చేసిన ఈ సినిమాను హిందీలో మాత్రం ఒక స్టార్ హీరోతో చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమా రీమేక్ హక్కులు కూడా చాలా తక్కువ ధరకే లభించాయి. కానీ ఈ సినిమాలో ఉన్న కంటెంట్ బాలీవుడ్ జనానికి కూడా బాగా నచ్చే అవకాశాలు ఉండటంతో భారీ పెట్టుబడితో ఒక స్టార్ హీరోను తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి కాగా నటీనటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. దర్శకత్వం కూడా కూడా కాస్త అనుభవం ఉన్న వారితోనే చేయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











