For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Amitabh Bachchan బంగ్లాలో బాంబు కలకలం.. ఆ మూడు రైల్వేస్టేషన్లలో కూడా?

  |

  బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కారణంగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో పోలీసు కంట్రోల్ రూమ్‌లో కలకలం రేగింది. అందులో మెగాస్టార్ ఇంటికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. నాలుగు చోట్ల బాంబులు అమర్చినట్లు బెదిరిస్తూ శుక్రవారం రాత్రి ముంబై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ కాల్ వచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్‌లు మరియు జుహులోని నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లాలో బాంబులు అమర్చినట్లు ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు శుక్రవారం రాత్రి కాల్ వచ్చింది. బాంబులు అమర్చినట్లు సమాచారం అందుకున్న తర్వాత ముంబైలో మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు మాత్రమే కాక నటుడు అమితాబ్ బచ్చన్ బంగ్లా వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

  పోలీసు అధికారి మాట్లాడుతూ, "కాల్ అందుకున్న తర్వాత, ప్రభుత్వ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌తో పాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ మరియు స్థానిక పోలీసులు ఈ ప్రదేశాలకు చేరుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు ఈ ప్రదేశాల్లో అనుమానాస్పదంగా ఏదీ కనుగొనబడలేదు కానీ పెద్ద సంఖ్యలో పోలీసులు మాత్రం ముందు జాగ్రత్త చర్యగా అక్కడ మోహరించారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇక కాల్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేయలేక పోయామని, కానీ బెదిరింపు కాల్ ఏ నెంబర్ నుంచి వచ్చిందో దాన్ని ట్రేస్ చేసే పనిలో ఉన్నామని వెల్లడించారు. తాము మళ్లీ ఆ నంబర్‌కు కాల్ చేసినప్పుడు, అవతలి వైపు నుంచి సమాధానం వచ్చింది, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అనే విషయం చెబుతూ ఆ వ్యక్తి ఫోన్ పెట్టేశాడని అంటున్నారు. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ వ్యక్తి ఎవరు అనే విషయం ట్రేస్ చేస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

  Bomb Threat Calls Amitabh Bachchans Bungalow along with 3 Railway Stations

  ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరినీ ప్రశ్నిస్తున్నారు. అయితే సెలబ్రిటీల ఇళ్లకు ఇలా బాంబు బెదిరింపులు రావడం చాలా సాధారణం అయిపోయింది. ఇక సినిమాల విషయానికి వస్తే అమితాబ్ చేతిలో చాలా ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. 'అయాన్ ముఖర్జీ యొక్క' బ్రహ్మాస్త్ర లో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ మరియు అలియా భట్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇందులో డింపుల్ కపాడియా, నాగార్జున అక్కినేని మరియు మౌని రాయ్ లు సైతం కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే నాగరాజు మంజులే డైరెక్షన్ లో 'ఝుండ్', ప్రభాస్ మరియు దీపికా పదుకొనేతో కలిసి నాగ్ అశ్విన్ పేరు పెట్టని ఒక సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇవన్నీ కాకుండా, బిగ్ బి కూడా మొదటిసారి ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించిన రూమి జాఫ్రీ యొక్క 'చెహ్రే' థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో రియా చక్రవర్తి, అను కపూర్ మరియు క్రిస్టల్ డిసౌజ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  English summary
  The Mumbai Police Chief Control Room received a call on Friday night that bombs had been planted at the Chhatrapati Shivaji Maharaj Terminus (CSMT), Byculla, Dadar railway stations and the bungalow of actor Amitabh Bachchan in Juhu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X