Raj Kundra pornography case: బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ.. రాజ్ కుంద్రాపై త్వరలోనే మరిన్ని కేసులు
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ సినిమాల వ్యవహారం రోజురోజుకు మరింత సీరియస్ గా మారుతోంది. ఈ కేసుపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు తీరిక లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక ఈ కేసులో బెయిల్ కోసం రాజ్ కుంద్రా చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అరెస్ట్ కంటే ముందే బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా జూలై 27వరకు కస్టడీలోనే ఉంచేందుకు పోలీసులు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. ఇక ఈ రోజు బెయిల్ పిటిషన్ పై విచారణ మొదలుకనుంది.

పోలీసు కస్టడీని సవాలు చేస్తూ
పోలీసు కస్టడీని సవాలు చేస్తూ బిజినెస్ టైకూన్ రాజ్ కుంద్రా మంగళవారం బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పిటిషన్‌ను నేడు బాంబే హైకోర్టు విచారించనుంది. అశ్లీల చిత్రాల కేసులో అతని పోలీసు కస్టడీ ఈ రోజు ముగిసింది. అశ్లీల చిత్రాలను రూపొందించాడనే ఆరోపణలతో కుంద్రా ను జూలై 19 న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు
కేసు విచారణ రోజురోజుకు మరింత వేగవంతంగా కొనసాగుతోంది. ఇటీవల క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి యొక్క డబ్బు అశ్లీల రాకెట్ కేసులో ప్రమేయం ఉందని దర్యాప్తు చేయడానికి ఫైనాన్షియల్ ఆడిటర్ను నియమించింది. ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ సెర్చింగ్ సమయంలో కుంద్రా అఫీస్ లో కొన్ని కీలక ఆధారాలను సేకరించింది.

త్వరలోనే మరిన్ని కేసులు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చట్టాల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నందున కుంద్రా త్వరలోనే మనీలాండరింగ్, అలాగే ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కేసులను సైతం ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ కేసులో అశ్లీల చిత్రాలను షూట్ చేయడం అలాగే పలు ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. అలాగే యాప్‌ల నుంచి సంపాదించిన డబ్బును బిట్‌కాయిన్లలో పెట్టుబడులు పెడుతున్నారా అని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

విచారణ ఎదుర్కొంటున్న శిల్పా శెట్టి
బలవంతంగా మోసం చేసి అశ్లీల సినిమాలు షూట్ చేసినట్లు కూడా కుంద్రాపై గతంలో కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటికే పలుమార్లు శిల్పా శెట్టిని సైతం విచారించారు. వారి ఇంటిలో కూడా సోదాలు నిర్వహించగా అందులో 122 అశ్లీల సినిమాలకు పైగా వీడియో డేటా దొరికినట్లు సమాచారం. అలాగే పోర్న్ సినిమాల కోసం 9కోట్ల డీల్ కు సంబంధించిన ఆధారాలను కూడా సేకరీంచారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











