For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  శ్రీదేవిని టార్గెట్ చేస్తారా! పగబట్టిన బోనీ కపూర్? పాపం ప్రియా వారియర్..

  |
  Boney Kapoor will Not Rest Till Priya Prakash Varrier's Sridevi Bungalow is Shelved | Filmibeat

  శ్రీదేవి హాఠాన్మరణం గతేడాది దేశ వ్యాప్తంగా అభిమానులను విషాదంలోకి వెళ్లేలా చేసింది. ఆ బాధ నుంచి బయటకు రావడానికి కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్‌కు చాలా సమయమే పట్టింది. అందరూ ఆ విషాదాన్ని మరిచిపోతున్న తరుణంలో 'శ్రీదేవి బంగ్లా' అనే మూవీ టీజర్ మరోసారి ట్రాజెడీని గుర్తు చేసింది.

  ఇంటర్నెట్ సెన్సేషన్, కేరళ బ్యూటీ ప్రియా వారియర్‌ను బాలీవుడ్‌కు పరిచయ చేస్తూ ప్రశాంత్ మాంబులి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'శ్రీదేవి బంగ్లా'. ఇందులో ప్రియా వారియర్ శ్రీదేవి అనే నటి పాత్రలో కనిపించబోతోంది. అయితే టీజర్లో... ఆమె బాత్ టబ్‌లో పడిపోయి చనిపోయినట్లు చూపించడంతో అంతా షాకయ్యారు.

  శ్రీదేవి డెత్ ఇన్సిడెంట్ క్యాష్ చేసుకుంటున్నారా?

  శ్రీదేవి డెత్ ఇన్సిడెంట్ క్యాష్ చేసుకుంటున్నారా?

  ‘శ్రీదేవి బంగ్లా' టీజర్ చూసిన చాలా మంది శ్రీదేవి డెత్ ఇన్సిడెంటును టీజర్లో ఫోకస్ చేయడం ద్వారా పబ్లిసిటీ పెంచుకునే ప్రయత్నం చేశారని, ఆ విషాద సంఘటనను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యం వారిలో కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

  సినిమా రిలీజ్ కానివ్వను అంటూ పగబట్టిన బోనీ కపూర్?

  సినిమా రిలీజ్ కానివ్వను అంటూ పగబట్టిన బోనీ కపూర్?

  టీజర్ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ బోనీ కపూర్ ఇప్పటికే చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపారు. ఈ విషయంలో బోనీ కపూర్ ఎలాంటి ప్రకటన చేయక పోయినా.... లీగల్ ప్రొసీడింగ్స్ చాలా సీరియస్‌గా మూవ్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్టు రద్దు చేయించాలనే కసిగా ఉన్నారని బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.

  అలా చూపించడాన్ని తట్టుకోలేక పోతున్న బోనీ

  అలా చూపించడాన్ని తట్టుకోలేక పోతున్న బోనీ

  శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. శ్రీదేవి మరణం కుటుంబం మొత్తాన్ని విషాదంలోకి నెట్టివేసింది. వారు ఇంకా ఆ ట్రాజెడీ నుంచి పూర్తిగా బయటకు రాక ముందు.. శ్రీదేవి డెత్ ఇన్సిడెంటును వాడుకుంటూ కొందరు చేస్తున్న ప్రయత్నాలను ఆయన సహించలేకపోతున్నారు.

  న్యాయ స్థానంలోనే తేల్చుకుంటామంటున్న దర్శకుడు

  న్యాయ స్థానంలోనే తేల్చుకుంటామంటున్న దర్శకుడు

  బోనీ కపూర్ పంపిన లీగల్ నోటీసులపై దర్శకుడు ప్రశాంత్ మాంబల్లి స్పందిస్తూ.... తమ చిత్రం శ్రీదేవి బయోపిక్ కాదని, సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ లోకంలో శ్రీదేవి అంటే ఆవిడ ఒక్కరేనా? అది కామన్ నేమ్, ఎవరైనా వాడుకోవచ్చు. బోనీ కపూర్ పంపిన లీగల్ నోటీసులను కోర్టులో ఎదుర్కొంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా కథ బయటకు చెప్పబోము అని స్పష్టం చేశారు.

  పాపం ప్రియా వారియర్

  పాపం ప్రియా వారియర్

  అయితే ఎన్నో ఆశలతో బాలీవుడ్లో కెరీర్ మొదలు పెట్టబోతున్న ప్రియా వారియర్‌కు ‘శ్రీదేవి బంగ్లా' వివాదం తలనొప్పి తెచ్చిపెట్టింది. పరిస్థితి చూస్తుంటే ఆమె బాలీవుడ్ ఎంట్రీ సజావుగా సాగేలా కనిపించడం లేదు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

  English summary
  A source close to Boney Kapoor told Deccan Chronicle, "Boney won’t play into their hands and make any statement as these people [behind Sridevi Bungalow] are only looking at how to generate curiosity in their pathetic film. But he will take every legal step to prevent this sleazy film from being made." "For Boney, a sleazy representation of his wife’s life is unacceptable. He will not rest easy until this project is aborted," one of Kapoor's close friends told the daily.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more