twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ఎందాకా వచ్చిందంటే? సీబీఐ సమాధానం ఏంటో తెలుసా?

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020 తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో బాంద్రాలోని తన నివాసంలో మరణించారు. అప్పటి నుంచి పలు కోణాల్లో సీబీఐ, ఈడీ, ఎన్సీబీ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది జూన్ నెలకు రెండేళ్లు పూర్తి అవుతున్నా ఈ కేసులో పురోగతి ఏమిటి అనే విషయం తెలియదు. ఇదే విషయాన్ని ఒక వ్యక్తి ఆర్టీఐ ద్వారా ప్రశ్నించగా దానికి సీబీఐ సమాధానం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

    డ్రగ్ కోణంలో

    డ్రగ్ కోణంలో

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 14 జూన్ 2020న ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముంబై పోలీసులు తమ దర్యాప్తు మేరకు ముందు దీనిని ఆత్మహత్య అని భావించారు. అయితే సుశాంత్ కుటుంబ సభ్యుల డిమాండ్‌పై సుప్రీంకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. సిబిఐతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) కూడా డ్రగ్ కోణంలో కేసును దర్యాప్తు చేస్తోంది.

    బెయిల్‌పై విడుదల

    బెయిల్‌పై విడుదల


    ఇప్పటికే ఈ కేసులో సుశాంత్ స్నేహితురాలు అయిన నటి రియా చక్రవర్తి , ఆమె సోదరుడు కూడా అరెస్టయ్యారు. అనంతరం ఇద్దరూ బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక రాజ్‌పుత్ మృతి కేసును విచారిస్తోన్న సీబీఐ ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఈ కేసులో ఎలాంటి సమాచారం ఇవ్వడానికి సీబీఐ సిద్ధంగా లేదు. ఎలాంటి సమాచారం ఇచ్చేది లేదని సీబీఐ నిరాకరించింది.

    సమాచారం ఇవ్వడానికి

    సమాచారం ఇవ్వడానికి

    ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద సిబిఐను ఒక వ్యక్తి కోరగా ఈ దరఖాస్తుపై సమాచారాన్ని అందించడానికి ఏజెన్సీ నిరాకరించింది. వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ సంస్థ ప్రకారం, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వడానికి సీబీఐ బృందం సుముఖంగా లేదు.

    ఇంకా దర్యాప్తులో

    ఇంకా దర్యాప్తులో

    ఆర్టీఐ కింద కోరిన సమాచారంపై సీబీఐ బృందం స్పందిస్తూ, 'సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. దర్యాప్తు పురోగతికి సంబంధించిన సమాచారం కేసు దర్యాప్తును ప్రభావితం చేయవచ్చు, ఈ కారణంగా అభ్యర్థించిన సమాచారం ఇవ్వబడదని పేర్కొన్నారు.

    'దిల్ బేచార'

    'దిల్ బేచార'

    ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన కెరీర్‌ను టీవీతో ప్రారంభించాడు. 'పవిత్ర రిష్ట'తో మంచి ఫేమస్ అయిన సుశాంత్, తన సహనటి అంకితా లోఖండేతో చాలా ఏళ్లుగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. 'కై పో చే' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన సుశాంత్. ఆ సినిమా తరువాత, 'శుద్ధ్ దేశీ రొమాన్స్', 'PK', 'MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ', 'కేదార్‌నాథ్' వంటి ప్రముఖ చిత్రాలలో పనిచేశాడు. సుశాంత్ మరణానంతరం ఆయన నటించిన చివరి చిత్రం 'దిల్ బేచార' విడుదలైంది.

    మరణానంతరం

    మరణానంతరం

    నిజానికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా బాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. టెలివిజన్ రంగం ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి వరుస విజయాలు సాధించారు. స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే సుశాంత్‌ను బాలీవుడ్‌లోని కొన్ని వర్గాలు అణగదొక్కేందుకు ప్రయత్నించారనే వార్తలు ఆయన మరణానంతరం బయటకు వచ్చాయి. .


    Read more about: cbi సీబీఐ
    English summary
    CBI Denies Information Through RTI on Sushant Singh Rajput Case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X