For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ట్రైలర్ చూశారా? రాఘవేంద్రరావు కొడుకు, కోడలు పిచ్చెక్కించారు

|

కంగనా రనౌత్ నటించిన 'క్వీన్' మూవీ అప్పట్లో సంచలన విజయం అందుకుంది. 2014లో వచ్చిన ఈచిత్రంలో కంగనా రనౌత్‌తో పాటు రాజ్ కుమార్ రావు ముఖ్య పాత్ర పోషించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'మెంటల్ హై క్యా'. అయితే కొన్ని వివాదాల కారణంగా టైటిల్ 'జడ్జిమెంట్ హై క్యా'గా మార్చారు.

జులై 26న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. సినిమాపై అంచనాలు మరింత పెంచింది. విభిన్నమైన కథ, క్యారెక్టరైజేషన్లతో ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. జడ్జిమెంటల్ హై క్యా చిత్రానికి రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించగా, ఆయన భార్య కనికా థిల్లాన్ కథ అందించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. 'హమ్ పోలీస్ వాలె దునియాకా కాట్ తే హై... యే దోనోం మిల్కే హమారా కాట్ రహీహై' అంటూ మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావు తమ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. సస్పెన్స్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

కంగనా రనౌత్ ఇందులో తడబాటు, సంక్లిష్ట మనస్తత్వం, అనుమానాస్పదంగా కనిపించే బాబీ అనే పాత్రలో నటించింది. రాజ్ కుమార్ రావు కేశవ్ పాత్ర పోషించాడు. కేశవ్.. బాబీ పక్క ఇంట్లో అద్దెకు దిగుతాడు. అతడిపై బాబీ ఓ కన్నేసి ఉంచుతుంది. అతడి నార్మల్ లైఫ్ అంతా ఫేక్ అని గుర్తిస్తుంది. ఓ హత్య కేసులో పోలీసులు ఈ ఇద్దరినీ అనుమానిస్తారు. తమను తాను నిర్దోషులుగా ప్రూవ్ చేసుకునే క్రమంలో వీరి మధ్య జరిగే ఫైట్ ఆసక్తి కరంగా చూపించబోతున్నారు.

Check out Judgementall Hai Kya Official Trailer

కాగా ట్రైలర్లోని ఓ సీన్లో కంగనా... 'ఐ విల్ ఎక్స్‌ఫోజ్ యూ' అనే డైలాగ్ చెబుతుంది. హృతిక్ రోషన్, ఆదిత్య పంచోళి, మరికొందరు బాలీవుడ్ ప్రముఖులతో కంగనా రనౌత్ వివాదాలు కొనసాగుతున్నాయి. వారిని ఉద్దేశించే ట్రైలర్లో ఈ డైలాగ్స్ పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Kangana and Rajkummar are set to take you on a crazy ride with Judgementall Hai Kya. The trailer of the film has been released. Judgemental Hai Kya is an upcoming Indian Hindi-language black comedy film produced by Ekta Kapoor and directed by Prakash Kovelamudi, starring Kangana Ranaut, Rajkummar Rao, Amyra Dastur, Jimmy Sheirgill and Hrishitaa Bhatt. The screenplay was written by Kanika Dhillon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more