వెండితెరపై మరో మాస్టర్ మైండ్ బయోపిక్.. బాలీవుడ్ డైరెక్టర్ బిగ్ ప్లాన్

వెండితెరపై బయోపిక్ ల పర్వం ఇప్పట్లో తగ్గేలా లేదు. ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించిన జీవితలపై వస్తున్న సినిమాలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. బాగ్ మిల్కా బాగ్ సినిమా నుంచి ఎమ్ఎస్.ధోని బయోపిక్ వరకు అన్ని సినిమాలకు మంచి గుర్తింపు దక్కింది. అయితే ఈ సారి ఎవరు ఊహించని విధంగా బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ ఒక ప్రపంచ మేధావి కథను తెరకెక్కించాడానికి సిద్ధమవుతున్నాడు.

చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అంటే తెలియని వారు ఉండరు. చిన్నారుల పాఠ్య పుస్తకాల్లో కూడా ఆనంద్ జీవితంపై అనేక రకాల కథలు ఉన్నాయి. చెస్ ఆటకు మన దేశంలో అంతగా గుర్తింపు లేకపోవడం వలన ఆనంద్ పేరు ఇంకా అనుకున్నంత స్థాయిలో పెరగలేదు. లేకుంటే మరో లెవెల్లో ఉండేది. ఎందుకంటే విశ్వనాథన్ ఆనంద్ సాధించిన విజయాలు అన్ని ఇన్ని కావు. ఇండియాలో చెస్ ఆటతో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇతర దేశాల దిగ్గజాలకు ఫొటోగా నిలవగలరని గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఆయానది. విశ్వనాథన్ చెస్ పోటీలలో ఎన్నో పథకాలు అందుకున్నారు.

Chess legend Viswanathan Anand biopic plans in bollywood

చెస్ ఆటలో ఎన్నోసార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ గా నిలిచిన ఆనంద్ కథ వెండితెరపైకి రానున్నట్లు తెలుస్తోంది. పలు బాలీవుడ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న దర్శకుడు ఎల్.రాయ్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఆనంద్ బయోపిక్ అని తెలుస్తోంది. చదరంగం ఆటలో ఉన్న గొప్ప తనాన్ని సినిమాటిక్ గా చూపిస్తే అద్భుతంగా ఉంటుందని ఆ సినిమాతో మంచి గుర్తింపు అందుకోవచ్చని ప్లాన్ రెడీ చేసుకుంటున్నారట. త్వరలోనే సినిమాకి సంబంధించిన ఒక అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X