పుల్వామా వీరులకు నివాళి అర్పిస్తూ బాలీవుడ్ స్టార్స్ సాంగ్
జమ్మూ కశ్మీర్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఈ బాంబు దాడిలో దాదాపు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఎటాక్ తర్వాత దేశంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిభిరాలపై బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
ఈ దాడిలో మరణించిన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ 'తూ దేశ్ మేరా' అనే దేశభక్తి పాటను చిత్రీకరించారు. ఇందులో బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఐశ్వర్యరాయ్, అమీర్ ఖాన్, టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్, రణబీర్ కపూర్ నటించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) ఈ పాటను పుల్వామా దాడిలో మృతి చెందిన సైనికులకు నివాళి అర్పిస్తూ అంకితం చేయనున్నారు. బుధవారం ఈ పోస్టర్ విడుదలైంది. ఆగస్టు 15న ఈ వీడియో సాంగ్ విడుదల చేయబోతున్నారు.

'తు దేశ్ మేరా' అంటూ సాగే ఈ దేశ భక్తి పాటను ప్రముఖ సింగర్లు జావేద్ అలీ, జుబిన్ నూతియాల్, షబాబ్ శబ్రి, కబీర్ సింగ్ ఆలకించారు. వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ సాగే ఈ సాంగులో భాగం కావడంపై సెలబ్రిటీలు ఆనందం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











