ద్రౌపదిగా దీపికా పదుకోన్.. 1000 కోట్ల భారీ ప్రాజెక్ట్‌లో..

By Rajababu

మహాభారతం చిత్రాన్ని తెరకెక్కించేందుకు బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ స్పీడ్ పెంచారు. మహాభారతాన్ని సినిమాగా తీయాలని కొద్ది రోజుల క్రితం తన మనసులో మాటను బయటపెట్టిన సంగతి తెలిసిందే. సుమారు రూ.1000 కోట్లతో ఈ సినిమాను భారీగా రూపొందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ చిత్రానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని వివిధ భాషలకు చెందిన అగ్ర నటులతో ఈ సినిమాను రూపొందించేందుకు ముందుకెళ్తున్నట్టు బాలీవుడ్ మీడియా కథనం.

మహాభారతంలోని కీలక పాత్ర ద్రౌపది కోసం బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొన్‌ను సంప్రదించినట్టు సమాచారం. వివాదాస్పద చిత్రం పద్మావతిలో తనదైన రీతిలో రాణించిన దీపిక ఈ పాత్రకు సరైనదనే నిర్ణయానికి అమీర్‌ఖాన్ వచ్చినట్టు సమాచారం. అయితే ద్రౌపది పాత్రకు దీపిక గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది కొద్ది రోజులు ఆగితే స్పష్టత రావడం ఖాయం.

Deepika Padukone as Draupadi in Aamir Khans Mahabharata!

ఇప్పటివరకు అమీర్‌ఖాన్, దీపిక కలిసి పనిచేయలేదు. ఒకవేళ మహాభారతం కోసం వీరిద్దరూ కలిసి పనిచేస్తే సెన్సేషనల్ ప్రాజెక్ట్ అయ్యేది గ్యారంటీ అని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X