twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీపిక పడుకొనే 'చపాక్' సినిమాకు ప్రోత్సాహం: రాయితీ ప్రకటించిన రాష్ట్రం

    |

    యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా రూపొందిన తాజా చిత్రం 'చపాక్'. బాలీవుడ్ భామ దీపిక పడుకొనే ముఖ్యపాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలు, వాటి వల్ల జరిగే పరిణామాలు ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు 'చపాక్' చిత్రానికి అండగా నిలిచాయి.

    'చపాక్' సినిమాకు గాను మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు పన్ను రాయితీ ప్రకటించాయి. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ''సమాజంలో మహిళలపై యాసిడ్ దాడి వంటి ఘోరమైన అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచే సినిమా ఇది. కాబట్టి ఫ్యామిలీలతో కలిసి సినిమాకు వెళ్లండి. మీ అవగాహనను అందరికీ చెప్పండి'' అని రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ సీఎం ట్వీట్ చేశారు.

    Deepika Padukones Chhapaak: Chhattisgarh Government Decision

    పన్ను రాయితీ ప్రకటన సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ''యాసిడ్ దాడికి గురైనప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దనే పాజిటివ్ మెసేజ్ ఇస్తున్న సినిమా చపాక్. అందుకే ట్యాక్స్ రద్దు చేశాం''అని తెలిపారు.

    మరోవైపు జేఎన్‌యూ ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్లి దీపిక పడుకొనే లెఫ్ట్ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన తర్వాత ఈ సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. సినిమా ప్రమోషన్ కోసమే దీపిక ఈ పనిచేశారనే విమర్శలు వస్తున్న తరుణంలోనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇలా పన్ను మినహాయింపు ప్రకటించడం గమనార్హం. ఇదిలాఉంటే ట్విట్టర్‌లో #Boycott Chhapaak, #ISupportDeepika హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

    English summary
    Deepika Padukone's Chhapaak movie is tax free on Chhattisgarh and Madya Pradesh states.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X