Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇంత దౌర్భాగ్యమా! ఆ హీరోయిన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి.. రాజకీయ నేత డిమాండ్
బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత తజిందర్ బగ్గా డిమాండ్ చేస్తున్నారు. జేఎన్‌యూలో జరిగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో దీపికా పదుకొనే తీరుపై ఆయన మండిపడ్డారు. ఆమెపై విమర్శలు గుప్పిస్తూ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది? బీజేపీ నేత దీపికపై ఎందుకింతలా విరుచుకుపడ్డారు? వివరాల్లోకి పోతే..

హింసాత్మక ఘటన.. దేశవ్యాప్త సంచలనం
జేఎన్‌యూ (జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ) ఆదివారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ హింసాత్మక ఘటనపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మంగళవారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌కి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

విద్యార్థులకు దీపికా పదుకొనే మద్దతు.. వీడియో వైరల్
జేఎన్‌యూలో జరిగిన హింసాత్మక ఘటనలను నిరసిస్తూ.. జేఎన్‌యూ బయట ఆందోళన చేస్తున్న విద్యార్థులకు దీపికా పదుకొనే మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇంత దౌర్భాగ్యమా! దీపికా పదుకొనేపై బీజేపీ నేత ఫైర్
దీంతో ఈ పరిణామంపై బీజేపీ నేత తాజిందర్ పాల్ సింగ్ బగ్గా రియాక్ట్ అయ్యారు. దీపికా పదుకొనే జేఎన్‌యూకు వెళ్లడంపై మండిపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామంటూ నినదించిన వారికి దీపికా పదుకొనే మద్దతు తెలపడం దౌర్భాగ్యమని అన్నారు. ఈ మేరకు వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
|
ఇదీ జేఎన్‌యూ క్యాంపస్‌లో జరిగింది
ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన కొందరు దుండగులు జేఎన్‌యూ లోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు. సబర్మతితో పాటు మరికొన్ని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విచక్షణా రహితంగా విద్యార్థులపై రాళ్లతో, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దుశ్చర్యలో 40 మంది విద్యార్థులతోపాటు జేఎన్‌యూ ఎస్‌యూ ప్రెసిడెంట్, ప్రొఫెసర్లకు తీవ్ర గాయాలయ్యాయి.

భారీగా పోలీస్ బలగాలు.. హిందూ రక్షా దళ్
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ దుర్ఘటనపై ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లర్లు జరగకుండా జేఎన్‌యూలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. జేఎన్‌యూలో హింసకు ఏబీవీపీయే కారణమని లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ దాడికి తామే కారణమని హిందూ రక్షా దళ్ ప్రకటించింది.