twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మృత్యువుతో ఇర్ఫాన్ పోరాటం.. దీపికా భావోద్వేగం.. కంటతడి..

    By Rajababu
    |

    అరుదైన వ్యాధికి గురైన విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. అతను ఏ వ్యాధికి గురయ్యాడనే విషయాన్ని మాత్రం తన కుటుంబ సభ్యులు గోప్యంగానే ఉంచుతున్నారు. తానే ఆ వ్యాధి గురించి సరైన సమయంలో వెల్లడిస్తాను అని ఇర్ఫాన్ చెప్పారు. అయితే తన భర్త మాత్రం మృత్యువుతో పోరాడుతున్న యోధుడిగా కనిపిస్తున్నాడని చెప్పడం గమనార్హం. వ్యాధి తీవ్రత ఎక్కువగా కావడంతో చికిత్స కోసం ఇర్ఫాన్ అమెరికాకు వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొన్ అతడికి అండగా నిలిచింది.

    Recommended Video

    శ్రీదేవి మరణవార్త మరవకముందే ....
     పీకూ సినిమాలో కలిసి

    పీకూ సినిమాలో కలిసి

    వాస్తవానికి దీపికా పదుకోన్, ఇర్ఫాన్ ఖాన్ ఇద్దరు కలిసి విశాల్ భరద్వాజ్ రూపొందించే చిత్రంలో నటించాల్సింది. ఆ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించినప్పడు పీకూ మ్యాజిక్ రిపీట్ అవుతుందనే ఆశాభావాన్ని సినీ వర్గాలు వ్యక్తం చేశాయి. 2015లో సుజిత్ సర్కార్ రూపొందించిన పీకూలో దీపిక, ఇర్ఫాన్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వారిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

     విశాల్ భరద్వాజ్ చిత్రంలో

    విశాల్ భరద్వాజ్ చిత్రంలో

    పీకూ చిత్రం తర్వాత మళ్లీ ఇర్ఫాన్, దీపికా జోడి కలిసి నటిస్తున్నారనే సరికి మళ్లీ విశాల్ భరద్వాజ్ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. కానీ విశాల్ ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పని ఆలస్యం చేయడం, అంతలోనే ఇర్ఫాన్ అరుదైన వ్యాధికి గురికావడంతో ఆ ప్రాజెక్ట్ ప్రశ్నార్థకంగా మారింది.

     ఇర్ఫాన్ ఖాన్ గురించి దీపికా

    ఇర్ఫాన్ ఖాన్ గురించి దీపికా

    ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి గురించి దీపికా పదుకోన్‌ ఇటీవల స్పందించారు. ఇర్ఫాన్ ఆరోగ్యం మెరుగుపడాలని భగవంతుడిని ప్రార్థించాలని ప్రజలను కోరుతున్నాను. ఒకవేళ ఇర్ఫాన్ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే.. ఆయన పరిస్థితి మెరుగుపడాలని నేనే కాదు.. ప్రతీ ఒక్కరు కోరుకోవాలి అని దీపికా అన్నారు.

    ఇర్ఫాన్‌కు అరుదైన వ్యాధి అని..

    ఇర్ఫాన్‌కు అరుదైన వ్యాధి అని..

    ఇర్ఫాన్‌కు అరుదైన వ్యాధి సోకిందనే వార్త విన్నప్పటి నుంచి భావోద్వేగానికి గురవుతున్నాను. ఓ దశలో కంటతడి కూడా పెట్టాను. నాకు అత్యంత ఆప్తుడైన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కొంత సమయం దొరికితే నేను ఆయన ఆరోగ్యం బాగుపడాలని కోరుకొంటున్నాను అని దీపికా చెప్పారు.

    నాకు మెడ నొప్పి

    నాకు మెడ నొప్పి

    ప్రస్తుతం నేను కూడా మెడ నొప్పితో బాధపడుతున్నాను. అది భరించే స్థితిలో ఉన్నప్పటికీ.. నాకు ఓ పక్క ఆందోళనకరంగానే ఉంది. అలాంటిది ఇర్ఫాన్‌ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారంటే వారి కుటుంబానికి ఎంత బాధ ఉంటుందో మాటల్లో చెప్పలేం అని దీపికా ఆవేదన వ్యక్తం చేశారు.

     ఇర్ఫాన్ ప్రైవసీని గౌరవిద్దాం..

    ఇర్ఫాన్ ప్రైవసీని గౌరవిద్దాం..

    ఇలాంటి పరిస్థితుల్లో ఇర్ఫాన్‌కు మనమంతా అండగా ఉండాలి. మీడియా, ఇతర సినీ వర్గాలు కూడా ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మెదులుకోవాలి. మనమంతా ఆయన వ్యక్తిగత జీవితానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకొందాం. ఆయన ప్రైవసీని గౌరవిద్దాం అని దీపికా పదుకొన్ అన్నారు.

    English summary
    Actor Irfan Khan took to Twitter to reveal that he has been diagnosed with a rare disease. The 51-year-old actor said that he will reveal further details after a week or so, after undergoing a few more tests and reaching a conclusive diagnosis. He also requested people not to speculate about his condition. Deepika Padukone said, I think we should always pray for people and their good health. If his (Irrfan's) health is not best at this point, I think it is important for all of us to pray, not just for him, but for everyone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X