twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ముద్దులేంటి? లవ్ జిహాద్‌ను ప్రేరేపిస్తోంది: ‘కేదార్‌నాథ్’ మూవీని నిషేధించాలి!

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సారా అలీ ఖాన్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేదార్‌నాథ్' సినిమా విడుదల కాకుండా బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు కేదార్‌నాథ్ తీర్థ పురోహతులు. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు ఆరోపించారు.

    ముద్దులతో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు.. ప్రకృతితో పోరాటం!ముద్దులతో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు.. ప్రకృతితో పోరాటం!

    కేదార్‌నాథ్ పుణ్యక్షేత్ర పరిధిలోని పురోహితుల సంఘం చైర్మన్ వినోద్ శుక్లా మాట్లాడుతూ... 'ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, లవ్ జిహాద్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు ఉందని, ఈ సినిమా విడుదల కాకుండా నిషేదం విధించాలని, లేనిచో ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు.

    పవిత్ర క్షేత్రంలో వల్గర్ డాన్సులు

    పవిత్ర క్షేత్రంలో వల్గర్ డాన్సులు

    పవిత్రమైన కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం పరిసరాల్లో వల్గర్ డాన్సులు చేసినట్లు సినిమాలో చూపించబోతున్నారు. దీన్ని మేము ఎంత మాత్రం అంగీకరించబోము. దీనిపై ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు శుక్లా తెలిపారు.

    2013 వరదల నేపథ్యం

    2013 వరదల నేపథ్యం

    2013లో కేదార్‌నాథ్‌ను ముంచెత్తిన భారీ వరదల నేపథ్యంతో ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో వరద విషాదంతో పాటు హీరో హీరోయిన్ ముద్దు సీన్లు కూడా చూపించారు. ఈ ట్రైలర్ విడుదల తర్వాత ఆందోళనలు మొదలయ్యాయి.

     అనేక అభ్యంతరాలు

    అనేక అభ్యంతరాలు

    సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశాలు, అసభ్యకర డాన్సులు, వరద విషాదంలో ముద్దు సీన్లు ఇలా చాలా ఉన్నాయి. అందుకే ఈ సినిమాపై బ్యాన్ విధించాలని కోరుతున్నామని వినోద్ శుక్లా తెలిపారు.

    కేదార్‌నాథ్

    కేదార్‌నాథ్

    కేదార్‌నాథ్ చిత్రం ద్వారా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా తెరంగ్రేటం చేస్తోంది. సుశాంత్ సింగ్, సారా మధ్య ఘాటైన రొమాంటిక్ సీన్లు చిత్రీకరించారు. డిసెంబర్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    Demand raised on 'Kedarnath' film ban.Kedarnath priests have demanded that a blanket ban be imposed on the movie stating that it hurts the Hindu religious sentiments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X