»   » జాన్వీ కపూర్ తొలి చిత్రం షూటింగ్ పూర్తి.. హీరోతో ఉన్న అందమైన ఫోటో!

జాన్వీ కపూర్ తొలి చిత్రం షూటింగ్ పూర్తి.. హీరోతో ఉన్న అందమైన ఫోటో!

Subscribe to Filmibeat Telugu

తన కుమార్తె జాన్విని పెద్ద హీరోయిన్ గా చూడాలని శ్రీదేవి కలలు కంది. ఆ కోరిక తీరకుండానే శ్రీదేవి మరణించింది. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి చిత్రం దఢక్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చిత్ర దర్శకుడు, హీరో ఇషాన్ తో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఈ ఫొటోకు జాన్వీ హోమ్ అనే క్యాప్షన్ పెట్టడం విశేషం.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శశాంక్ ఈ చిత్రానికి దర్శకుడు. దఢక్ చిత్రం ఘనవిజయం సాధించిన మరాఠీ చిత్రం సైరాత్ కు రీమేక్ గా రూపొందుతోంది. ప్రేమ కథ చిత్రంగా రూపొందుతున్నా ఈ చిత్రపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

Home

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Apr 16, 2018 at 12:01pm PDT

శ్రీదేవి కుమార్తె తొలి చిత్రంలో ఎలా నటించిందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. శ్రీదేవి ఈ చిత్ర ప్రారంభానికి ముందు తన కుమార్తె విషయాలు పలు జాగ్రత్తలు తీసుకుంది. తన కుమార్తెకు మంచి గుర్తింపు రావాలని తపించింది. కానీ శ్రీదేవి ఫిబ్రవరి 24 న దుబాయిలో అనూహ్య పరిస్థితుల్లో మరణించిన సంగతి తెలిసిందే.

English summary
Dhadak shooting wraps up. Janhvi Kapoor hugs Ishaan Khatter and Shashank Khaitan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X