క్రిష్ 4: తండ్రి కొడుకుల మధ్య విభేదాలు.. హృతిక్ కి నచ్చలేదా!
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న క్రిష్ సిరీస్ కు ఏస్థాయిలో క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోయి మిల్ గయా తో ప్రారంభం అయిన ఈ సిరీస్ ఆ తరువాత క్రిష్, క్రిష్ 3 తో కొనసాగింది. క్రిష్ 4 కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి. హృతిక్ రోషన్ అద్భుతమైన శక్తులు ఉన్న వ్యక్తిగా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. క్రిష్ సిరీస్ కు చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అంత అభిమానులుగా మారిపోయారు.
బాలీవుడ్ వర్గాల కథనాల ప్రకారం క్రిష్ 4 కథ విషయంలో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. హృతిక్ రోషన్ తండ్రి రాజేష్ రోషన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2020 కల్లా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని హృతిక్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తండ్రి రాకేష్ రోషన్ కథ, చిత్రీకరణ విషయంలో ఆయన అనుసరించబోయే విధానం హృతిక్ రోషన్ కు నచ్చడం లేదని వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రానికి ఎలాంటి నటీనటుల్ని తీసుకోవాలి, గ్రాఫిక్స్ ఎలా ఉండాలి అనే విషయంలో హృతిక్ తండ్రితో విభేదిస్తున్నాడని సమాచారం. నేటి తరం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉండేలా ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ఉండాలని హృతిక్ రోషన్ భావిస్తున్నాడు. ఏది ఏమైనా క్రిష్ 4 కోసం ఇప్పటినుంచే ఎదురుచూసే అభిమానులు ఉంటారని తెలపడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications











