Dilip Kumar dies at 98: కన్నీరుమున్నీరైన భార్య సైరా భాను.. ఓదార్చిన షారుక్ ఖాన్
ఇండియన్ సినిమా లెజెండ్ దిలీప్ కుమార్, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మధ్య ఎనలేని అనుబంధం ఉంది. నటుడిగా దిలీప్ కుమార్ తనకు స్పూర్తి అంటూ షారుక్ పలుమార్లు చెప్పారు. సమయం చిక్కినప్పుడల్లా వారిద్దరూ కలుసుకొని కుశల ప్రశ్నలు వేసుకొనే వారు.అలాంటి తన అభిమాన నటుడు దిలీప్ కుమార్ మరణించిన వేళ షారుక్ ఖాన్ విషాదంలో మునిగిపోయాడు. దిలీప్ కుమార్, షారుక్ కుటుంబాల మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటే..

దిలీప్ సాహెబ్ అంటే..
సూపర్ స్టార్ షారుక్ ఖాన్ అంటే కూడా దిలీప్ కుమార్ కుటుంబానికి అత్యంత ఇష్టమని చెప్పనక్కర్లేదు. ఓ సందర్బంలో దిలీప్ కుమార్ భార్య సైరా భాను మాట్లాడుతూ.. నాకు, దిలీప్ కుమార్‌కు కుమారుడు ఉంటే షారుక్ ఖాన్‌లా కనిపించే వాడేమో అని అన్నారు. షారుక్ ఖాన్ అంటే సైరాభానుకు చెప్పలేనంత ప్రేమ అని పలు సందర్భాల్లో ఆయనపై అభిమానాన్ని చాటుకొన్నారు.

నాకు కొడుకు ఉంటే అచ్చు షారుక్‌లా
ప్రముఖ నటి హేమా మాలిని దర్శకత్వంలో షారుక్ నటించిన తొలి చిత్రం దిల్ ఆష్నా హై చిత్రానికి దిలీప్ సాహెబ్ ముహుర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా దిలీప్ సాహెబ్ మాట్లాడుతూ.. నాకు కొడుకు ఉంటే అచ్చం షారుక్ ఖాన్‌లా ఉండేవాడు అని అన్నారు. షారుక్‌ను ఎప్పుడు కలిసినా అతడి తలను ఎందుకు నిమురుతానంటే.. అతడి జుట్టు, నా జుట్టు ఒకేలా ఉంటుంది. అందుకే ఆప్యాయంగా అతడి తలపై చేయి పెట్టి ప్రేమగా నిమురుతాను అని దిలీప్ ఓ సందర్భంలో అన్నారు.

దిలీప్, షారుక్ ఫోటోలు వైరల్
దిలీప్ కుమార్ ఇంటికి పలు సందర్బాల్లో షారుక్ ఖాన్ సందర్శించారు. దిలీప్ సాహెబ్ పుట్టిన రోజు, పండుగ పబ్బాలకు ఆయనను కలిసి షారుక్ ఆశీస్సులు తీసుకొనే వారు. దిలీప్‌ను కలిసిన ప్రతీసారి అప్యాయంగా కలిసి ఫోటోలు దిగే వారు. ఆ ఫోటోలను ఫైజల్ ఫరూఖీ మీడియాకు చేరవేయడం లేదా సోషల్ మీడియాలో షేర్ చేయడం చేసేవారు.

పుట్టెడు దు:ఖంలో ఉన్న సైరాభాను
భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న సైరాభానును షారుక్ ఖాన్ స్వయంగా పరామర్శించారు. సైరా భాను పక్కనే కూర్చుని ఆమె బాధను పుంచుకొన్నారు. కన్నీటి పర్యంతమైన సైరా భానును ఓదార్చుతూ షారుక్ కనిపించారు. దిలీప్ కుమార్ పార్ధీవ దేహానికి షారుక్ ఖాన్ శ్రద్దాంజలి ఘటించారు.
Recommended Video

బుధవారం సాయంత్రం అంత్యక్రియలు
దిలీప్ కుమార్ జూన్ 30వ తేదీన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని పీడీ హిందూజా హాస్పిటల్‌లో చేరారు. బుధవారం ఉదయం తెల్లవారుజామున 7.30 గంటల ప్రాంతంలో ఆయన ఈ లోకాన్ని వీడారు. 9.30 గంటల ప్రాంతంలో దిలీప్ కుమార్ పార్దీవ దేహాన్ని బంద్రాలోని తన నివాసానికి చేర్చారు. సాయంత్రం 5.30 గంటలకు శాంతాక్రజ్ వెస్ట్‌లోని ముస్లిం శ్మశానవాటికలో అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











