Dilip Kumar Health update: ఫ్యాన్స్‌కు శుభవార్త.. డిశ్చార్జికి వైద్యుల గ్రీన్ సిగ్నల్
బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ అభిమానులకు శుభవార్త. శ్వాస సంబంధిత సమస్యలతో ఇటీవల ముంబైలోని హిందూజా హాస్పిటల్‌లో చేరిన ఆయన కొద్ది రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. 98 ఏళ్ల ఈ మహా నటుడు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఆయనను జనవరి 10వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు వైద్యులు తెలిపారు.
దిలీప్ కుమార్ ఆరోగ్యం గురించి ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ ఫైజల్ ఫారూఖీ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. అభిమానులు, స్నేహితులు, సన్నిహితుల ప్రార్థనలు ఫలించాయి. వైద్యుల కృషి వల్ల దిలీప్ సాబ్ ఆరోగ్యం మెరుగుపడింది. దిలీప్ కుమార్‌కు వైద్యం అందించిన డాక్టర్ జలీల్ పార్కర్, డాక్టర్ నితిన్ గోఖలేతో వ్యక్తిగతంగా మాట్లాడాను. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గురువారం (జూన్ 10) రిలీజ్ చేస్తామని చెప్పారు అని ట్వీట్ చేశారు.

దిలీప్ కుమార్ ఆరోగ్యంపై డాక్టర్ జలీల్ పార్కర్ స్పందిస్తూ.. ఆయనకు చేసిన ఫ్లూయిడ్ 350సీసీ ప్రోసిజర్ ప్రస్తుతం తొలగించాం. ఇప్పుడు ఆక్సీజన్ సాచురేషన్స్ 100 శాంతం ఉన్నాయి. అంతా సవ్యంగా ఉండే గురువారం డిశ్చార్జి చేస్తాం అని చెప్పారు.
దిలీప్ కుమార్ సినీ కెరీర్ విషయానికి వస్తే మిలాన్, జుగ్నూ, అందాజ్, బాబుల్, నయాదౌర్, మధుమతి, కోహినూర్, మొఘల్ ఏ ఆజామ్, క్రాంతి, కర్మ, సౌదాఘర్ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.
ఆయన భారతీయ సినిమాకు సేవలందించినందుకు గాను.. 1991లో పద్మ భూషణ్, 1194లో దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు, 2015లో పద్మ విభూషన్ అవార్డుతో సత్కరించింది. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా 1998లో నిషాన్ ఏ ఇంతియాజ్ అవార్డుతో సన్మానించింది.


Click it and Unblock the Notifications











