»   » ఓ డైరెక్టర్ నైటీలో రమ్మన్నాడు.. ఇండస్ట్రీలో అంతా ఇడియెట్సే.. క్యాస్టింగ్ కౌచ్‌పై..

ఓ డైరెక్టర్ నైటీలో రమ్మన్నాడు.. ఇండస్ట్రీలో అంతా ఇడియెట్సే.. క్యాస్టింగ్ కౌచ్‌పై..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Mahi Gill Expresses Her Experiences In Industry
   A director asked to come in a nightie, says Mahie Gill

  బాలీవుడ్‌లో కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతారనే పేరు అందాల తార మహీగిల్‌కు ఉంది. 2009లో దేవ్ డీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఏ విషయాన్నైనా ముందు, వెనుకా ఆలోచించకుండా బయటపెట్టేస్తుంది. తాజాగా తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను ఇటీవల మీడియా ముందు బయటపెట్టారు. హాలీవుడ్ ‌దర్శకుడు వెయిన్‌స్టెయిన్ దుశ్చర్యలు వెలుగులోకి వచ్చిన తర్వాత బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్, ఇతర రంగాల్లో ఒక్కొక్కరు క్యాస్టింగ్ కౌచ్ గురించి బయపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీ గిల్ చెప్పిన విషయాలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.

  చాలా మంది వేధించారు..

  చాలా మంది వేధించారు..

  పడక గదికి వస్తేనే వేషాలు ఇస్తామని చాలా మంది నా కెరీర్ తొలినాళ్లలో వేధించారు. చాలా సార్లు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. చాలా మంది డైరెక్టర్ల పేర్లు కూడా గుర్తుకు లేవు. పరిశ్రమలో ఎక్కువ మంది ఇడియెట్స్ ఉంటారు అని మహీ ఆరోపించింది.

  డైరెక్టర్ నైటీలో రమ్మన్నాడు..

  డైరెక్టర్ నైటీలో రమ్మన్నాడు..

  ఓ సారి నేను ఓ డైరెక్టర్‌ను కలిశాను. అప్పుడు నేను సల్వార్ సూట్ వెళ్లాను. అందుకు నీవు ఇలా సల్వార్ సూట్‌లో వస్తే ఎవరూ వేషాలు ఇవ్వరు అని అన్నాడు. మరో డైరెక్టర్‌ను కలిస్తే ఆయన ‘నిన్ను నైటీలో చూడాలనుకొంటున్నాను అని అన్నాడు అని మహీ గిల్ అన్నారు.

  తొలినాళ్లలో అనేక కష్టాలు

  తొలినాళ్లలో అనేక కష్టాలు

  సినీ అవకాశాల కోసం వచ్చినప్పుడు ముంబై నాకు చాలా కొత్త. ఇక్కడ ఎవరు మంచి వాళ్లో.. ఎవరు చెడ్డవాళ్లో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ముంబైలోని సినీ పరిశ్రమలో ఉన్న మాటలు వినాల్సి వచ్చేది. మంచి వ్యక్తులను ఎవరని గుర్తించడం.. అలాంటి వారిని కలవడం చాలా కష్టమయ్యేది అని గిల్ వెల్లడించింది.

  వాళ్ల ప్రవర్తనతో విసిగిపోయాను..

  వాళ్ల ప్రవర్తనతో విసిగిపోయాను..

  సినీ పరిశ్రమకు కొత్త కావడంతో అలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కొనాలో తెలిసేది కాదు. కొత్త వాళ్లను కలిసేందుకు వెళ్లే సమయంలో చాలా టెన్షన్‌గా ఉండేది. చాలా మంది అడ్డదిట్టంగా మాట్లాడే వాళ్లు. కొంత మంది ప్రవర్తనతో అక్కడి నుంచి పారిపోయేదాన్ని అని మహీ గిల్ చెప్పింది.

  డబ్బులు లేక కష్టపడ్డాను

  డబ్బులు లేక కష్టపడ్డాను

  సినీ అవకాశాల కోసం చాలా ఆఫీసులు తిరిగేదానిని. ఒంటరిగా వెళ్లేందుకు భయం వేసేది. దాంతో నా స్నేహితులను వెంటపెట్టుకొని వెళ్లేదానిని. అవకాశాలు లభించకపోవడంతో పూట గడవడం కష్టంగా మారింది. చేతిలో డబ్బులు లేని పరిస్థితి. చాలా బాధగా ఉండేది.

  దూరదర్శన్ సీరియల్స్‌లో నటించా

  దూరదర్శన్ సీరియల్స్‌లో నటించా

  డబ్బుల కోసం దూరదర్శన్ సీరియల్స్‌లో నటించేదానిని. దేవ్ డీ సినిమాతో నాకు బాలీవుడ్ అవకాశం తలుపుతట్టింది. ప్రస్తుతం తింగ్మాన్షు ధులియా రూపొందించే సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగస్టర్3 చిత్రంలో నటిస్తున్నాను అని మహీ గిల్ పేర్కొన్నది.

  English summary
  Mahie Gill says that there was a time when she just stopped meeting directors at their office or took a friend along so that no one would act smart. The actor shares that there have been instances when people tried to make indecent advances to her in return for work. Mahie said, I had to meet a director. he told me, ‘If you wear a suit and come, nobody is going to cast you in a film.’ Then, I met another director and he tells me, ‘I want to see how you look in a nightie’. So, you see, there are idiots all around.”
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more