»   » మళ్లీ ప్రేమలో దర్శకుడు.. భార్యకు విడాకులు..గోవా సుందరితో డేటింగ్!

మళ్లీ ప్రేమలో దర్శకుడు.. భార్యకు విడాకులు..గోవా సుందరితో డేటింగ్!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  వెండితెర మీద లవ్, రొమాంటిక్ సినిమాలను ఆవిష్కరించడంలో దర్శకుడు ఇంతియాజ్ అలీది ప్రత్యేకమైన శైలి. జబ్ వీ మెట్, లవ్ ఆజ్ కల్, రాక్‌స్టార్, కాక్‌టెయిల్, హైవే సినిమాలు ఆయన ప్రతిభకు అద్దం పట్టాయి. గతంలో భార్యకువ విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్న ఇంతియాజ్ అలీ ప్రస్తుతం గోవా సుందరి ప్రేమలో పడినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. కొంతకాలంగా ఉత్తర గోవాలో రెస్టారెంట్ నిర్వహించే సెలబ్రిటీ చెఫ్, సారా టాడ్‌తో ఇంతియాజ్ అలీ ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఇంతియాజ్ అలీ, సారా అభిరుచులు ఒకేలా ఉండటం కారణంగా వారిద్దరూ ఒకటయ్యారని వారి సన్నిహితులు చెప్పుకొంటున్నారు.

  సారా టాడ్‌తో డేటింగ్

  సారా టాడ్‌తో డేటింగ్

  కొంతకాలంగా ఉత్తర గోవాలో రెస్టారెంట్ నిర్వహించే సెలబ్రిటీ చెఫ్, సారా టాడ్‌తో ఇంతియాజ్ అలీ ప్రేమలో మునిగి తేలుతున్నాడు. సమయం చిక్కినప్పుడల్లా వారిద్దరూ కలిసి మీడియా కంటపడుతున్నారు. ఎన్నో వంటల పుస్తకాలు రాసిన సారా టాడ్‌తో డేటింగ్ చేయడం బాలీవుడ్ పత్రికలకు పంటపండినట్టయింది.

  ఒంటరితనం వీడి జంటగా

  ఒంటరితనం వీడి జంటగా

  ఇంతియాజ్ అలీ, సారా అభిరుచులు ఒకేలా ఉండటం కారణంగా వారిద్దరూ ఒకటయ్యారని వారి సన్నిహితులు చెప్పుకొంటున్నారు. ఇంతియాజ్‌కు, సారాకు ట్రావెలింగ్, ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఈ రెండు అంశాలు వారిద్దరిని కలిపాయి. ప్రైవేట్ జీవితాన్ని ఆస్వాదించే ఇంతియాజ్ ఇప్పుడు ఆమెతో ప్రేమలో పడ్డాక బాహ్య ప్రపంచంలోకి కనపడుతున్నాడు. అయితే వారి పెళ్లిపై ఇంకా క్లారిటీ లేదు అనేది బాలీవుడ్ పత్రికల కథనం.

  సోషల్ మీడియాలో వైరల్

  సోషల్ మీడియాలో వైరల్

  సారా, ఇంతియాజ్‌ కలిసి బీచ్‌లో తీసుకొన్న ఫోటో సోషల్ మీడియాలోకి రావడంతో వారి డేటింగ్ వ్యవహారం బయటకి వచ్చింది. ఇంతియాజ్ కంపెనీని బాగా ఆస్వాదిస్తున్నాను అని ఆ ఫోటోను స్వయంగా సారానే పోస్ట్ చేయడం గమనార్హం.

  భార్యకు విడాకులు

  భార్యకు విడాకులు

  గతంలో ప్రీతీ అలీ అనే ఫిల్మ్ మేకర్‌ను ఇంతియాజ్ పెళ్లి చేసుకొన్నాడు. 2012లో వారిద్దరూ విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత దేవేందర్ గర్చా‌తో ఆరేళ్లపాటు ప్రేమాయణం సాగించారు. ప్రస్తుతం సారాతో పరిచయం ప్రేమగా మారింది.

  షాహిద్ కపూర్‌తో చిత్రం

  షాహిద్ కపూర్‌తో చిత్రం

  సినిమాల పరంగా ఇంతియాజ్ అలీ షాహీద్ కపూర్‌తో సినిమాను ప్రారంభించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నది.

  English summary
  Director Imtiaz is dating celebrity chef, restaurateur and cookbook author Sarah Todd. Imtiaz was previously married to filmmaker Preety Ali. The got divorced in 2012. Sarah, on the other hand, reportedly got out of a six-year relationship with ex-finance Devinder Garcha. Sarah runs a Australian-themed restaurant in North Goa. On the work front, Imtiaz will begin working on his next film with Shahid Kapoor.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more