Just In
- 15 min ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 2 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
- 2 hrs ago
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
Don't Miss!
- Sports
మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీ.. అయినా తప్పని ఓటమి!
- Finance
బిట్‌కాయిన్ వ్యాల్యూ 4.2 శాతం జంప్, 50,948 డాలర్లకు..
- News
నేను అల్లాటప్పా పామును కాదు, కోబ్రాను! ఒక్క కాటు చాలు: మిథున్ చక్రవర్తి సంచలనం
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అదేలోకంగా ఉంటున్న హాట్ హీరోయిన్.. లోఫర్ బ్యూటీ ఇలా మారిందేంటి? అసలు విషయం తెలిస్తే షాక్!
నేటితరం హీరోహీరోయిన్లకు డేటింగులు, షాపింగులు, లవ్ బ్రేకప్స్ ఇవన్నీ కామనే. ఇలాంటి వాటిని చాలా సింపుల్‌గా తీసుకుంటూ ఉండటం బోలెడన్ని సందర్భాల్లో చూశాం. ఇదే బాటలో బాలీవుడ్ బ్యూటీ, హాట్ హీరోయిన్ దిశా పటానీ కూడా తన బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్‌కి బ్రేకప్ చెప్పి పప్పీతో హాయిగా ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ అసలు సంగతేంటి? ఆ పప్పీ మ్యాటర్ ఎందుకొస్తోంది? వివరాల్లోకి పోతే..

దిశా పటాని సెక్సీ డ్రెస్.. ప్రియుడితో అలా
గత కొన్ని సంవత్సరాలుగా ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం సాగిస్తోంది దిశా. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ ఇద్దరూ డేటింగ్‌లో పాల్గొంటూ వస్తున్నారు. అలా ఎంజాయ్ చేస్తూ ఎన్నోసార్లు కెమెరాకు కూడా చిక్కారు. సెక్సీ డ్రెస్ వేసుకొని, గ్లామర్ లుక్‌లో కనిపిస్తూ దిశా పటాని సూపర్ కిక్కిస్తుంటుంది.

బ్రేకప్.. అయినప్పటికీ
ఇన్నాళ్లు చెట్టాపట్టాలేసుకు తిరిగి అందరి నోళ్ళలో నానిన ఈ లవ్ జంట ఇటీవలే విడిపోయింది. తమ ప్రేమ బంధానికి గుడ్ బై చెప్పుకొని ఎవరి దారిన వారంటున్నారు. అయినప్పటికీ ఈ ఇద్దరిలో ఏ మాత్రం డిప్రెషన్ కనిపించకపోవడం విశేషం.

కొత్త బాయ్ ఫ్రెండ్‌తో దిశా.. ఎవరో తెలిస్తే మాత్రం షాక్
అన్నీ మర్చిపోయి టైగర్ ష్రాఫ్ హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ ఉండగా.. ఇటు దిశా మాత్రం తన కొత్త బాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతోంది. అయితే ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే మాత్రం షాక్ కావాల్సిందే. అదేనండీ! తన పెట్ డాగ్ పప్పీ. ఈ మధ్యకాలంలో దిశా ఎక్కడకి వెళ్ళినా కుక్కపిల్లను వెంట పెట్టుకుని వెళ్తుండటం చూస్తూనే ఉన్నాం.

షాపింగ్ మాల్‌కు వెళ్లి కెమెరాకు చిక్కడంతో..
అప్పుడు ఎలాగైతే టైగర్‌ని వదిలి ఉండలేకపోయిందో ఇప్పుడు పెట్ డాగ్ పెప్పీని వదిలి ఉండలేకపోతోంది దిశా. అంతేకాదు తన పెంపుడు జంతువుల కోసం ఒక ప్రత్యేక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచి అందులో ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఇటీవల తన పప్పితో కలిసి ఆమె షాపింగ్ మాల్‌కు వెళ్లి కెమెరాకు చిక్కడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యాయి.

అప్పుడు టైగర్.. ఇప్పుడు పప్పీ.. సూపర్
దీంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు దిషాను ఓ ఆట ఆడుకుంటున్నారు. టైగర్‌ను వదిలి పప్పీతో తిరుగుతున్నావా? అంటూ కొంటెగా కామెంట్లు పెడుతున్నారు. దిశా.. నువ్వు సూపర్ అప్పుడు టైగర్.. ఇప్పుడు పప్పీ.. అదిరింది అంటూ ఆమె అందాలను పొగుడుతున్నారు.

ఊపేస్తున్న దిశా.. సోషల్ మీడియా గిరాకీ
ఇకపోతే సోషల్ మీడియాలో సెగలు పుట్టించడం దిశా పటానికి వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలోనే కొన్నిరోజుల క్రితం ప్యాంట్ విప్పుతూ.. లో దుస్తులను చూపిస్తూ హాట్ ఫోటో షూట్ చేసిన ఆమె, ఇటీవలే మరి కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి మరింత అగ్గి రాజేసింది. అందుకే ఆమెకు సోషల్ మీడియా గిరాకీ చాలా ఎక్కువ.


లోఫర్ బ్యూటీ.. టాలీవుడ్ ఎంట్రీ
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన దిశా పటాని.. ఆ తర్వాత బాలీవుడ్ గడప తొక్కి అక్కడ భాగీ 2 , ఎంఎస్ ధోని, మలంగ్ లాంటి సినిమాలు చేసింది. ఇటీవలే సల్మాన్‌కి జోడీగా భారత్ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇటీవలే 'మాలాంగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.