twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీ జీవితంలో ఎప్పటికీ.. హృతిక్‌కు డాక్టర్ల వార్నింగ్.. ఏం జరిగిందంటే..

    |

    బాలీవుడ్‌లో గొప్ప డ్యాన్సర్లలో హృతిక్ రోషన్ ఒకరంటే ఎలాంటి అనుమానం అక్కర్లేదు. 2000లో వచ్చిన కహో నా ప్యార్ హై చిత్రంలో ఆయన వేసిన డ్యాన్స్‌లు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఊర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా హృతిక్ డ్యాన్సులు విశేషంగా ఆకట్టుకొన్నాయి. అలాంటి హృతిక్‌కు జీవితంలో ఎన్నడూ డ్యాన్స్ చేయలేవని చెబితే ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అలాంటి సంఘటనను హృతిక్ వెల్లడించారు.

    నీ జీవితంలో నీవు డ్యాన్స్ చేయలేవు

    నీ జీవితంలో నీవు డ్యాన్స్ చేయలేవు

    ఇటీవల ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా హృతిక్ మాట్లాడుతూ.. నేను కొన్ని రకాలు ఆరోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు వైద్యులు.. నీ జీవితంలో నీవు ఎప్పుడూ డ్యాన్స్ చేయలేవు అని చెప్పారు. దాంతో నేను షాక్ గురయ్యాను. నాకు ఇష్టమైన డ్యాన్స్ నాకు దూరమతుందనే ఆలోచన నాకు దిగ్భ్రాంతికి గురిచేసింది అని హృతిక్ చెప్పారు.

    వైద్యులు చెప్పిన మాటలు పట్టించుకోలేదు

    వైద్యులు చెప్పిన మాటలు పట్టించుకోలేదు

    అయితే వైద్యులు చెప్పిన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ నా డ్యాన్సులో వేగాన్ని తగ్గించుకొని తక్కువ వేగంతో డ్యాన్స్ చేశాను. కానీ తగిన జాగ్రత్తలు తీసుకొన్నాను. కొన్నిసార్లు చాలా రిస్క్ తీసుకొన్నాను. డ్యాన్స్ చేయవద్దని చెప్పినా నేను దానికి దూరం కాలేను అని హృతిక్ తెలిపారు.

    డ్యాన్స్ వల్ల శరీరం ఫిట్‌గా

    డ్యాన్స్ వల్ల శరీరం ఫిట్‌గా

    శరీరం చాలా ఫిట్‌గా ఉండటానికి డ్యాన్సులు చాలా ఉపయోగపడుతాను. దేహంలోని కేలరీలు, కండరాలు పటిష్టంగా మారుతాయి. శరీరంలోనే ఫ్లెక్సిబులిటీ ఉంటుంది. మనిషిని చాలా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. నా తల్లి, పిల్లలను కూడా డ్యాన్స్ చేయాలని ఎంకరేజ్ చేస్తాను అని హృతిక్ వెల్లడించారు.

    సూపర్ 30 మూవీలో క్రేజీగా

    సూపర్ 30 మూవీలో క్రేజీగా

    డ్యాన్స్ రియాలిటీ షోలు ఔత్సాహిక నటులకు, డ్యాన్సర్లకు మంచి వేదికలుగా మారుతున్నాయని హృతిక్ తెలిపారు. యువతలో ఉండే టాలెంట్‌ను బయటపెట్టడానికి అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ ప్రస్తుతం సూపర్ 30 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో గణితశాస్త్ర పండితుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం 2019, జూలై 26లో రిలీజ్ కానున్నది.

    English summary
    On International Dance Day, Hrithik opened up the time when doctors declared that he would never be able to dance again. In a recent interview with Hindustan Times, when asked what does dance mean to him, the actor said, "I feel dance is a very powerful medium to draw people towards physical fitness.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X