For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పబ్లిగ్గా లైంగిక వేధింపులు, రేప్ జరిగినట్లు ఫీలయ్యానంటూ హీరోయిన్‌ ఆవేదన!

|

సినిమా హీరోయిన్ల పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు ఈ మధ్య కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఇషా గుప్తా పబ్లిగ్గా సెక్సువల్ హరాస్మెంటుకు గురయ్యారు. తన తాజా చిత్రం 'వన్ డే : జస్టిస్ డెలివర్డ్' రిలీజ్ సందర్భంగాసెలబ్రేషన్ మూడ్లో ఉన్న ఆమె ఊహించని అనుభవం ఎదుర్కొన్నారు. తన చుట్టూ సెక్యూరిటీ గార్డులు ఉన్నప్పటికీ ఓ హోటల్ నిర్వాహకుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించారు. అతడి ఫోటో కూడా షేర్ చేస్తూ ఇతడు కళ్లతోనే మహిళలను రేప్ చేస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇషా గుప్తా ట్వీట్ వైరల్ అయింది. అతడిపై నెటిజన్లు మండి పడుతున్నారు.

సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ నేను రేప్‌కు గురైనట్లు ఫీలయ్యాను

‘‘నా లాంటి మహిళలకు కూడా ఈ దేశంలో భద్రత లేదు, సాధారణ అమ్మాల పరిస్థితి ఎలా ఉంటుంది. నా చుట్టూ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ నేను రేప్‌కు గురైనట్లు ఫీలయ్యాను. రోహిత్ విగ్.. నువ్వు పశుులాగా ప్రర్తించావు.'' అంటూ ఇషా గుప్తా ఫైర్ అయ్యారు.

ఇలాంటి వ్యక్తులు ఉంటే అంతే..

రోహిత్ విగ్ లాంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నా... మహిళలు అభద్రతా భావంతో ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది... అంటూ ఇషా గుప్తా తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. ఇషా గుప్తా చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది.

ఇతడే రోహిత్ విగ్, కళ్లతోనే రేప్ చేస్తాడు

నేను చెప్పిన రోహిత్ విగ్ ఇతడే. కళ్లతోనే రేప్ చేస్తాడు. అతడు నన్ను టచ్ చేయలేదు, ఏమీ అనలేదు. కానీ అతడి చూపుల్లోనే తప్పుడు ఉద్దేశ్యం కనిపించింది. నా అభిమానిగానో, లేక నేను నటిని అవ్వడం వల్లో కాదు.... నేను మహిళను కావడం వల్లే ఇలా నాపై నీచంగా చూశాడు. మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది? మహిళగా పుట్టడమే పాపమా?.... అంటూ ఇషా గుప్తా ఫైర్ అయ్యారు.

అతడి పేరు, అడ్రస్ చెప్పి మరి అప్రమత్తం చేసిన ఇషా

రోహిత్ విగ్ పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అతడికి గోవాలో సెయింట్ రేగిస్ గోవా అనే హోటల్ ఉందని వెల్లడించారు. ఇషా గుప్తాను అతడు ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టాడో ఆమె చేసిన ట్వీట్స్ స్పష్టం చేస్తున్నాయి. పలువురు బాలీవుడ్ తారల నుంచి సైతం ఇషా గుప్తాకు మద్దతు లభిస్తోంది.

English summary
"If a woman like me can feel violated and unsafe in the county, then idk what girls around feel. Even with two securities around I felt getting raped.. #RohitVig you’re a swine.. he deserves to rot. Men like Rohit vig, are the reason women don’t feel safe any where. You around me with your eyes and stares was enough. ROHIT VIG- the man who thinks staring at a woman all night n making her uncomfortable is ok. He didnot touch me or say anything. But throughout stare. Not as a fan, not Cus m an actor, but because m a Woman. Where are we safe? Is being a woman a curse!" Esha Gupta taeeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more