twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రాకు పోలీసుల నోటీసులు.. తెరపైకి భారీ స్కామ్!

    |

    బాలీవుడ్‌ను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ఓ పక్క కుదిపేస్తుంటే.. మరో పక్క సరికొత్త కుంభకోణం తెరపైకి వచ్చింది. తాజాగా బయటపడిన సోషల్ మీడియా కుంభకోణంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకోన్‌కు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఎంతకీ దీపిక, ప్రియాంక చోప్రాను వెంటాడుతున్న స్కామ్ ఏమిటంటే..

    ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు

    ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు

    మహారాష్ట్రలో ఫేక్, పెయిడ్ ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాలో సినీ, ఇతర ప్రముఖుల పేజీలను నడిపించే వ్యవహారాన్ని ముంబై పోలీసులు చేధించారు. డబ్బు చెల్లించి నకిలీ అకౌంట్లు చెలామణి చేయిస్తున్నారనే విషయాన్ని గుర్తించారు. చాలా రోజులు దర్యాప్తు చేసిన అనంతరం ఎనిమిది మంది ఈ కుంభకోణంలో భాగమని నిర్ధారణకు వచ్చారు. ఫేక్ అకౌంట్లు, ఫాలోవర్స్‌ చేయడం సైబర్ చట్టాలకు వ్యతిరేకమని పోలీసులు తెలిపారు.

    ఎనిమిది మంది బాలీవుడ్ పర్సనాలిటీలను

    ఎనిమిది మంది బాలీవుడ్ పర్సనాలిటీలను

    సోషల్ మీడియా ఫేక్, పెయిడ్ ఫాలోవర్స్ పేజ్‌కు సంబంధించి ప్రియాంక చోప్రా, దీపికా పదుకోన్‌తోపాటు ఎనిమిది మంది బాలీవుడ్ పర్సనాలిటీలను ముంబై పోలీసులు విచారించనున్నారు. ఈ హై ప్రొఫైల్ కేసులో బిల్డర్స్, క్రీడాకారులు, మరొకొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారు.

    ఈ రాకెట్‌లో 68 సంస్థలు

    ఈ రాకెట్‌లో 68 సంస్థలు

    సోషల్ మీడియాకు సంబంధించిన హై ప్రొఫైల్ కేసు గురించి ముంబై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వినయ్ కుమార్ చౌబే మాట్లాడుతూ.. దాదాపు 68 సంస్థలు ఈ రాకెట్‌లో ఉన్నట్టు మా దర్యాప్తులో గుర్తించాం. క్రైంబ్రాంచ్, సైబర్ సెల్‌కు సంబంధించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ ఈ దర్యాప్తులో సహకారం అందించాయి. ఇలాంటి కేసు దర్యాప్తు దేశంలోనే మొదటిసారి అని తెలిపారు.

    10 మంది ప్రముఖులు ఫేక్ ఫాలోవర్స్‌ను

    10 మంది ప్రముఖులు ఫేక్ ఫాలోవర్స్‌ను

    బాలీవుడ్‌లో ఫేక్ ఫాలోవర్స్‌ను కొన్నవారిలో చాలా మంది తారలు ఉన్నారు. దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రాతోపాటు 10 మంది ప్రముఖులు ఫేక్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నారు. ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేసే ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ స్కామ్ బయటకు వచ్చింది. తాను బాలీవుడ్ ప్రముఖులకు చాలా మంది అకౌంట్లను ఫేక్ ఫాలోవర్స్‌తో పెంచాం అని నిందితుడు తెలిపారు.

    Recommended Video

    Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
    100కుపైగానే సంస్థలు

    100కుపైగానే సంస్థలు

    ముంబైలో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను పెంచే కంపెనీలు 100కుపైగానే ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ నకిలీ ఫాలోవర్స్‌ను, రీట్వీట్స్, లైక్స్, వ్యూస్, సబ్‌స్క్రిప్షన్స్, కామెంట్స్ మేనేజ్ చేస్తుంటాయి. వాటిలో 68 కంపెనీలు ఫేక్ అకౌంట్లను అమ్ముతున్నట్టు ముంబై పోలీసులు చెప్పారు. ఇలాంటి అక్రమ వ్యాపారాలపై బయటకు తీయడానికి సెలబ్రిటీలను ప్రశ్నించనున్నాం అని తెలిపారు.

    English summary
    Mumbai Police likely to question Priyanka Chopra and Deepika Padukone in Fake social media followers scam. SIT comprising Crime Branch along with Cyber Cell busted 68 companies selling fake followers and fake social media activities like retweets, likes, view, subscriptions, comments etc.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X