»   » సెల్ఫీ పేరుతో తాకడమేంటీ.. విద్యాబాలన్‌, ప్రముఖ హీరో సోదరికి చేదు అనుభవం

సెల్ఫీ పేరుతో తాకడమేంటీ.. విద్యాబాలన్‌, ప్రముఖ హీరో సోదరికి చేదు అనుభవం

Posted By:
Subscribe to Filmibeat Telugu
సెల్ఫీ పేరుతో అసభ్యంగా తాకితే, విద్యాబాలన్ రియాక్షన్

ఒకప్పుడు సినీ తారలు కనిపిస్తే వెంటపడి ఆటోగ్రాఫులు తీసుకొనే వారు. కాలం మారింది. స్మార్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. హీరో, హీరోయిన్లు కనిపించగానే సెల్ఫీతో వారిని కెమెరాల్లో బంధిస్తున్నారు. తాజాగా సెల్ఫీ పేరుతో అమర్యాదగా ప్రవర్తించిన ఓ అభిమానికి ప్రముఖ తార విద్యాబాలన్, అన్షులా కపూర్ షాకిచ్చారు. ఇంతకి ఏమి జరిగిందంటే..

ముంబై ఎయిర్‌పోర్టులో

ముంబై ఎయిర్‌పోర్టులో

విలక్షణ నటి విద్యాబాలన్‌‌కు ముంబై ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలో కనిపించిన విద్యాబాలన్‌తో ఫొటో దిగేందు అత్యుత్సాహం ప్రదర్శించాడో ఓ అభిమాని. తనపైకి వచ్చి తాకేందుకు ప్రయత్నించిన ఫ్యాన్‌కు విద్యాబాలన్ గట్టిగా మందలించింది.

మీద పడటం ఎందుకు

మీద పడటం ఎందుకు

సెల్ఫీ తీసుకోవడానికి ఓ పద్దతి ఉండాలి. అలా మీద పడుతూ అమర్యాదగా ప్రవర్తిస్తావా అని ప్రయాణికుడిపై విద్యాబాలన్ కేకలేసింది. దాంతో అభిమాని కంగుతిని తప్పుకొన్నాడట.

 విద్య బాలన్ సెల్ఫీ దిగకుండానే

విద్య బాలన్ సెల్ఫీ దిగకుండానే

ప్రయాణికుడు చేసిన నిర్వాకంపై విద్యాబాలన్ మండిపడినట్టు వీడియోలలో స్పష్టమైంది. ఆ వ్యక్తికి ఫొటోకు ఫొజు ఇవ్వకుండానే అక్కడి నుంచి ఆమె రుసరుస వెళ్లిపోయిందట.

విద్యాబాలన్ అండగా

విద్యాబాలన్ అండగా

హద్దు మీరి ప్రవర్తించిన అభిమానికి షాకిచ్చిన విద్యాబాలన్‌కు నెటిజన్లు అండగా నిలిచారు. ఇతరు ప్రైవసీకి భంగం కలుగకుండా సెల్ఫీ తీసుకోవాల్సి ఉండాల్సిందని అభిమాని ప్రవర్తను కొందరు తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో విద్యాబాలన్ హుందాగా వ్యవహరించారని ఆమెకు పలువురు కితాబివ్వడం గమనార్హం.

 అర్జున్ కపూర్ సోదరికి

అర్జున్ కపూర్ సోదరికి

ఇదిలా ఉండగా, అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్‌ కూడా ఫ్యాన్స్ చేతిలో ఇబ్బందికి గురైంది. ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తాకడాన్ని గుర్తించిన ఆమె.. పక్కకు తప్పుకోవాలని హెచ్చరించారట.

సోదరికి రక్షణగా అర్జున్ కపూర్

సోదరికి రక్షణగా అర్జున్ కపూర్

అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చూసి తన చెల్లెలు వద్దకు అర్జున్ కపూర్ పరుగెత్తికెళ్లి రక్షణగా నిలిచాడట. దాంతో ఆ వ్యక్తి పక్కకు తుప్పుకొన్నట్టు మీడియా కథనాన్ని వెల్లడించింది.

 గతంలోనూ సెల్ఫీ సమస్యలు

గతంలోనూ సెల్ఫీ సమస్యలు

గతంలో బాలీవుడ్ తారలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, వరుణ్ ధావన్, సుస్మిత సేన్, కత్రినా కైఫ్, దీపికా పదుకొన్‌ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. హద్దు మీరి ప్రవర్తించిన ఓ వ్యక్తిపై దక్షిణాది నటి అసిన్ చేజేసుకొన్న సంగతి తెలిసిందే.

English summary
Crazy fans often create trouble for actors. However, not many know how they can affect the people around them as well. This week, both Vidya Balan and Anshula Kapoor (Arjun Kapoor’s kid sister) became victims of fanatics, who didn’t know where to draw the line.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu